మందులు వాడేటప్పుడు ఈ 3 తప్పులు చేయొద్దు..
ABN , Publish Date - May 29 , 2026 | 01:42 PM
మందులు ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉపయోగపడతాయి. అయితే వాటిని సరైన విధంగా తీసుకోకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మందులు తీసుకునేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపవచ్చు. అనారోగ్యం తగ్గించడానికి మందులు ఎంత ముఖ్యమో, వాటిని సరైన విధంగా తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. కానీ చాలామంది తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇవి వ్యాధిని మరింత పెంచే ప్రమాదం కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
డాక్టర్ సలహా లేకుండా మందులు వాడటం
జ్వరం, దగ్గు, జలుబు వచ్చినప్పుడు చాలామంది స్వయంగా మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేసి వాడేస్తుంటారు. ముఖ్యంగా పిల్లలకు ఇలా చేయడం ప్రమాదకరం. దీనివల్ల శరీరంపై దుష్ప్రభావాలు కలగవచ్చు.
మందుల కోర్సు మధ్యలోనే ఆపేయడం
కొంతమందికి ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడగానే యాంటీబయాటిక్ మందులు ఆపేస్తారు. దీంతో ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గకుండా మళ్లీ తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.
సమయానికి మందులు తీసుకోకపోవడం
కొంతమంది మందులు ఖాళీ కడుపుతో తీసుకుంటారు లేదా డాక్టర్ చెప్పిన సమయానికి కాకుండా ఆలస్యంగా వాడుతారు. అలాగే గడువు ముగిసిన మందులు వాడటం కూడా ప్రమాదకరం.
అధికంగా వాడటం ప్రమాదకరం
పెయిన్‌కిల్లర్స్‌ను ఎక్కువగా వాడటం వల్ల మూత్రపిండాలు, కాలేయంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో కిడ్నీ, లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
జెనరిక్, బ్రాండెడ్ మందుల మధ్య తేడా
జెనరిక్, బ్రాండెడ్ మందుల్లో ఉండే ఔషధ పదార్థం ఒకటే. వీటి మధ్య తేడా ప్రధానంగా కంపెనీ పేరు, ధరలో మాత్రమే ఉంటుంది. డాక్టర్ సూచనల మేరకు సరైన విధంగా వాడితే జెనరిక్ మందులు కూడా బ్రాండెడ్ మందుల్లాగే ప్రభావవంతంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఎబోలా వైరస్.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
30 ఏళ్లు దాటితే మోకాళ్ల నొప్పి ఎందుకు వస్తోంది?
For More Latest News