Share News

కేరళం తదుపరి సీఎం ఎవరు.. శశిథరూర్ సమాధానం ఏంటంటే..

ABN , Publish Date - May 04 , 2026 | 12:29 PM

కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ప్రస్తుతం యూడీఎఫ్ 97 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అధికార ఎల్‌డీఎఫ్ 42 సీట్లలో లీడింగ్‌లో ఉంది.

కేరళం తదుపరి సీఎం ఎవరు.. శశిథరూర్ సమాధానం ఏంటంటే..
Shashi Tharoor

కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ప్రస్తుతం యూడీఎఫ్ 97 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అధికార ఎల్‌డీఎఫ్ 42 సీట్లలో లీడింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో యూడీఎఫ్ విజయం తథ్యంగా కనిపిస్తోంది. దీంతో కేరళం తదుపరి సీఎం ఎవరనే చర్చ మొదలైంది. ఈ విషయంపై కాంగ్రెస్ నేత, కేరళంకు చెందిన శశి థరూర్ స్పందించారు (Kerala Election Results 2026).


'పాలక కూటమికి చెందిన కొందరు మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేశారు. వారికి ఓటు వేయడం అంటే, దుష్పరిపాలన కొనసాగడమేనని ప్రజలు గ్రహించారు. ఇది ఓటర్ల విచక్షణకు అద్భుతమైన సంకేతం. ఫలితం ఊహించిన దానికంటే మెరుగ్గా ఉంది. ఇక్కడ సునాయాసంగా మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలం. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయం నాకు తెలియదు. హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుంది' అని థరూర్ సమాధానమిచ్చారు (Shashi Tharoor).


కేరళంలో యూడీఎఫ్ గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యేందుకు పార్టీలో చాలా మంది అర్హులు ఉన్నారని (Kerala CM Race), అయితే ఆ పదవికి ముగ్గురి పేర్లను పరిశీలిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీజే కురియన్ శనివారం తెలిపారు. అయితే ఆయన ఆ ముగ్గురి పేర్లను వెల్లడించలేదు. ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో హైకమాండ్ తీసుకునే తుది నిర్ణయాన్ని పార్టీలోని ప్రతిఒక్కరూ ఆమోదిస్తారని ఆయన చెప్పారు.


ఇవి కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


కాసేపట్లో మొదలు కానున్న ఓట్ల లెక్కింపు..

Updated Date - May 04 , 2026 | 12:56 PM