అప్రెంటిస్‌షిప్
ABN , Publish Date - May 11 , 2026 | 05:04 AM
యూనియన్ బ్యాంక్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, డీఎల్‌ఆర్‌ఎల్...
యూనియన్ బ్యాంక్
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచీల్లో 1865 అప్రెంటి్‌సషిప్ ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది. ఇందులో తెలంగాణ 164, ఆంధ్రప్రదేశ్‌లో 303 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషలో మాట్లాడటం, రాయడం, చదవడంలో నైపుణ్యం ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా,
దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 19
వెబ్‌సైట్: www.unionbankofindia.co.in
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే - రాయ్‌పూర్ డివిజన్‌లో 1644 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రాయ్‌పూర్, వేగన్ రాయపూర్ డివిజన్లలో ఈ ఖాళీలు ఉన్నాయి.
ట్రేడ్‌లు: ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, పెయింటర్, ఎలకా్ట్రనిక్స్ మెకానిక్, మెషినిస్ట్ తదితరాలు
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతికి తోడు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత
ఎంపిక: టెన్త్, ఐటీఐ ట్రేడ్‌లో సాధించిన మార్కుల ఆధారంగా.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 4
వెబ్‌సైట్: https://apprenticeshipindia.gov.in
డీఎల్‌ఆర్‌ఎల్
హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓకి చెందిన డిఫెన్స్ ఎలకా్ట్రనిక్స్ రీసెర్చ్ లేబరేటర్(డీఎల్‌ఆర్‌ఎల్) బీఈ/బీటెక్ విద్యార్థులకు పెయిడ్ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తులు కోరుతోంది. కోర్సు మొదటి ఏడాది, ఆఖరు ఏడాదిలోకి 2026-27 ప్రవేశించే వారికి వీటిని ఉద్దేశించారు.
విభాగాలు: ఈీసీఈ 40, సీఎ్‌సఈ 25, మెకానికల్ ఇంజనీరింగ్ 10
స్టైపెండ్: రూ.30,000, రెండు విడతల్లో చెల్లిస్తారు.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 15
వెబ్‌సైట్: https://drdo.gov.in/
ఈ వార్తలు కూడా చదవండి...
డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్
జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం
సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News