Share News

తెలంగాణ టెట్ 2026 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల..

ABN , Publish Date - Jun 01 , 2026 | 05:40 PM

తెలంగాణలో టెట్ 2026 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. పాఠశాల విద్యాశాఖ టీఎస్ టెట్ జూన్ 2026 పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలు జూన్ 16 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు.

తెలంగాణ టెట్ 2026 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల..
Telangana TET 2026

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) 2026 షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పరీక్షలు జూన్ 16 నుంచి జూన్ 22 వరకు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం షిఫ్ట్‌ 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్ట్‌ 2 గంటల నుంచి 4:30 గంటల వరకు ఉంటుంది. పరీక్షలను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు.

TS TET.jpg


పేపర్-1, పేపర్-2 పరీక్షల తేదీలతో పాటు ఉత్తీర్ణత ప్రమాణాలను కూడా అధికారులు వెల్లడించారు. దీంతో పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ ప్రణాళికలను మరింత మెరుగ్గా రూపొందించుకునే అవకాశం లభించింది.

ఉత్తీర్ణతకు ఎంత మార్కులు కావాలి?

  • టీఎస్ టెట్ పరీక్ష మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు.

  • జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు సాధించాలి.

  • బీసీ అభ్యర్థులు 50 శాతం మార్కులు పొందాలి.

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధిస్తే అర్హత పొందుతారు.


Also Read:

తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభ పెట్టుకోవచ్చు: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి

రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా.. అనిపిస్తోంది: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

For More Telangana News

Updated Date - Jun 01 , 2026 | 05:53 PM