గుడ్ న్యూస్.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల..
ABN , Publish Date - May 19 , 2026 | 09:44 PM
తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదలైంది. వైద్య, ఆరోగ్య సేవల నియామక మండలి ప్రొవిజనల్ జాబితాను ప్రకటించింది.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదలైంది. వైద్య, ఆరోగ్య సేవల నియామక మండలి (MHSRB) ప్రొవిజనల్ జాబితాను ప్రకటించింది. 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అభ్యర్థులను ఎంపిక చేసింది.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఈ నెల 22, 23 తేదీలను నిర్ణయించింది. అన్ని సర్టిఫికెట్లతో హాజరు కావాలని అభ్యర్థులకు సూచించింది. వెరిఫికేషన్ అనంతరం తుది ఎంపిక జాబితాను ఎంహెచ్ఎస్ఆర్‌బీ విడుదల చేయనుంది. ఇటీవల 34 విభాగాల్లో 607 పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే 174 ఉద్యోగాలను భర్తీ చేయగా.. మిగిలిన 433 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్ ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆస్పత్రిలో సైకో హల్‌చల్
బంగ్లాదేశ్‌లో భారత మిషన్ అధికారి మృతి.. దర్యాప్తు ప్రారంభం..