తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ హాల్‌టికెట్లు విడుదల.. వాట్సప్‌లో ఇలా పొందండి..!
ABN , Publish Date - Mar 05 , 2026 | 05:34 PM
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణలో మార్చి14 నుంచి.. ఏపీలో16 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
హైదరాబాద్/అమరావతి, మార్చి 05: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణలో మార్చి14 నుంచి.. ఏపీలో16 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో ఆయా రాష్ట్రాల ఎస్ఎస్‌సీ బోర్డులు పరీక్షల హాల్‌టికెట్లను ఈ రోజు అంటే.. గురువారం విడుదల చేశాయి. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థుల హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లలో వేర్వేరుగా అందుబాటులో అధికారులు ఉంచారు.
తెలంగాణలో విద్యార్థులు తమ హాల్‌టికెట్లను బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ bsc.telangana.gov.in, ఏపీ విద్యార్థులు https://www.bse.ap.gov.inలో హాల్ టికెట్లు పొందవచ్చు. ఇక ఏపీ విద్యార్థులు మనమిత్ర (వాట్సాప్ నంబర్ 9552300009) లేదా లీప్ యాప్ ద్వారా.. అలాగే తెలంగాణ విద్యార్థులు వాట్సప్ నంబర్ (8096958096) ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలా కుదరకుంటే.. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల వద్ద నుంచి కూడా ఈ పరీక్ష హాల్ టికెట్లను విద్యార్థులు పొందవచ్చు.
తెలంగాణలో వాట్సప్‌లో ఇలా డౌన్‌లోడ్..
8096958096 వాట్సప్ నంబర్‌కు హాయ్ (Hi) అని సందేశం చేయండి.
మీ ఫోన్‌కి వెల్‌కమ్‌టూ మీ సేవ అని వస్తుంది.
చాట్‌లో SSC hall Ticket march -2026 అని టైప్ చేసి మెసేజ్ చేయండి.
మీ మొబైల్‌కు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్‌ను ఓపెన్ చేసి జిల్లా, పాఠశాల పేరును ఎంచుకోండి.
విద్యార్థి పేరు, పుట్టిన తేదీ నమోదు చేస్తే హాల్‌టికెట్ మీ ఫోన్‌లోనే వస్తుంది.
ఈ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసి భద్రపరుచుకోండి.
ఏపీలో వాట్సప్‌లో డౌన్‌లోడ్ ఇలా..
మీ ఫోన్‌లో 552300009 నంబర్‌కు హాయ్ (Hi) అని మెసేజ్ పంపాలి.
సర్వీస్ సెలక్షన్ అనే ఆప్షన్ వస్తుంది.
ఎడ్యుకేషన్ సర్వీసెస్‌ను ఎంచుకోండి.
అక్కడ ఎస్ఎస్సీ హాల్‌టికెట్ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
అప్లికేషన్ నంబర్/ చైల్డ్ ఐడీతోపాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి.
రెగ్యులర్/ప్రైవేట్/ ఓఎస్ఎస్‌సీ రెగ్యులర్/ఒకేషనల్‌లలో మీకు సంబంధించిన కేటగిరీని ఎంచుకొని కన్‌ఫర్మ్ చేయాలి.
ఆ తర్వాత కొన్ని నిమిషాలకు హాల్‌టికెట్ మీ వాట్సప్ నంబర్‌కే వస్తుంది.
ఈ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసి భద్రపరుచుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
ముగిసిన రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ
అస్వస్థతపై స్పందించిన హోం మంత్రి అనిత
For More AP News And Telugu News