ఇన్కమ్ ట్యాక్స్‌లో ఉద్యోగాలు.. మరికొన్ని గంటల్లో ముగియనున్న గడువు
ABN , Publish Date - Nov 08 , 2026 | 10:40 AM
ఆదాయపు పన్ను శాఖలో స్పోర్ట్స్ కోటా అర్హతతో ఉద్యోగాల భర్తీకి కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. నవంబర్ 10వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆదాయపు పన్ను శాఖలో స్పోర్ట్స్ కోటా అర్హతతో ఉద్యోగాల భర్తీకి కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. నవంబర్ 10వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది.
పోస్టుల వివరాలు..
వివిధ కేటగిరిల్లో మొత్తం 119 ఉద్యోగాలు..
ట్యాక్స్ అసిస్టెంట్: 44
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -2: 9
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 66
అర్హత..
10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి..
18 నుంచి 27 ఏళ్ల వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ..
అభ్యర్థులు క్రీడల్లో సాధించిన విజయాలు, ప్రదర్శన, సర్టిఫికేట్ల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఒరిజినల్ ధ్రువపత్రాలు పరిశీలిస్తారు.
నైపుణ్య పరీక్షలు నిర్వహిస్తారు.
దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ:
నవంబర్ 10వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్ఐడి అడ్మిషన్లు 2027 డిజైన్ కోర్సులు పీజీ ఇంటిగ్రేటెడ్ పీజీ పీహెచ్డీ దరఖాస్తు
For More Education News And Telugu News