భారతీయ విద్యార్థులకు గూగుల్ భారీ ఆఫర్.. ఏడాది పాటు ఉచితంగా గూగుల్ ఏఐ ప్లస్..
ABN , Publish Date - Aug 20 , 2026 | 01:50 PM
ఏఐ టూల్స్‌ను విద్యార్థులకు మరింత చేరువ చేసేందుకు గూగుల్ కీలక ప్రకటన చేసింది. భారతదేశంలోని కాలేజీ విద్యార్థులకు గూగుల్ ఏఐ ప్లస్ సభ్యత్వాన్ని 12 నెలల పాటు ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐ టూల్స్‌ను విద్యార్థులకు మరింత చేరువ చేసేందుకు గూగుల్ కీలక ప్రకటన చేసింది. భారతదేశంలోని కాలేజీ విద్యార్థులకు గూగుల్ ఏఐ ప్లస్ సభ్యత్వాన్ని 12 నెలల పాటు ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించింది. దీంతో విద్యార్థులు జెమినీ ఆధారిత అధునాతన ఏఐ టూల్స్‌ను పూర్తి ఉచితంగా ఉపయోగించుకోవచ్చు (Google AI Plus free for students).
భారతీయ విద్యార్థుల కోసం గూగుల్ ప్రస్తుతం మూడు రకాల ఆఫర్లను ప్రకటించింది. గూగుల్ ఏఐ ప్లస్‌ను అర్హత కలిగిన విద్యార్థులు ఏడాది పాటు ఉచితంగా పొందవచ్చు. గూగుల్ ఏఐ ప్రోను నెలకు రూ.489 చొప్పున గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు పొందే అవకాశం ఉంది. ఇక, యూట్యూబ్ ప్రీమియమ్‌తో కలిపిన గూగుల్ ఏఐ ప్రో ధర నెలకు రూ.550గా ఉంది (Google Gemini students India).
విద్యార్థుల కోసం జెమినీలో ప్రత్యేక స్టూడెంట్ హబ్‌ను కూడా గూగుల్ ప్రవేశపెడుతోంది. చదువుకు సంబంధించిన వివిధ పనులను ఒకే చోట నిర్వహించుకునేలా దీన్ని రూపొందించింది. పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడం, పరిశోధన చేయడం, పరీక్షలకు సిద్ధం కావడం, పునశ్చరణ చేసుకోవడం వంటి పనుల్లో విద్యార్థులకు ఇది సహాయపడనుంది (Gemini Student Hub).
అలాగే జెమినీలో స్టడీ నోట్‌బుక్స్ అనే కొత్త ఫీచర్‌ను కూడా గూగుల్ అందిస్తోంది (Gemini study tools). విద్యార్థులు తమ తరగతి నోట్స్, పాఠ్యాంశాలను ఉపయోగించుకుని వ్యక్తిగతంగా స్టడీ షెడ్యూల్‌ను రూపొందించుకోవచ్చు. అంతేకాకుండా ఇంటరాక్టివ్ దృశ్యాలు, ప్రశ్నలు, పునశ్చరణ వంటి ఫీచర్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. విద్యార్థులకు కష్టంగా అనిపించే అంశాలను కేవలం సమాధానం చెప్పడం ద్వారా కాకుండా, వాటిని దశలవారీగా అర్థం చేసుకునేలా జెమినీ కొత్త విద్యా సాధనాలను అందిస్తోంది.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
రూ.20 లంచం కేసులో 30 ఏళ్ల న్యాయ పోరాటం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..