Share News

NGELలో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీ

ABN , Publish Date - Jul 13 , 2026 | 02:44 PM

ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డిప్లొమా, ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NGEL) గుడ్‌న్యూస్ చెప్పింది. అసిస్టెంట్ ఇంజినీర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులతో కలిపి మొత్తం 114 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

NGELలో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీ
NTPC Green Energy Recruitment 2026

ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డిప్లొమా, ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NGEL) గుడ్‌న్యూస్ చెప్పింది. పలు రెగ్యులర్ పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియను ప్రారంభించింది. అసిస్టెంట్ ఇంజినీర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాల్లో మొత్తం 114 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అసిస్టెంట్ ఇంజినీర్ (RE) – ఈ0 గ్రేడ్

మొత్తం పోస్టులు: 100

  • యూఆర్ – 41

  • ఎస్సీ – 15

  • ఎస్టీ – 7

  • ఓబీసీ – 27

  • ఈడబ్ల్యూఎస్ – 10

డిప్యూటీ జనరల్ మేనేజర్ (RE) – ఈ6 గ్రేడ్

మొత్తం పోస్టులు: 14

  • యూఆర్ – 8

  • ఎస్సీ – 1

  • ఎస్టీ – 1

  • ఓబీసీ – 3

  • ఈడబ్ల్యూఎస్ – 1

మొత్తం ఖాళీలు: 114


విద్యార్హతలు

అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు:

AICTE/UGC లేదా రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో రెగ్యులర్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అదనంగా ప్రభుత్వ లేదా ప్రైవేట్ పవర్ సెక్టార్‌లో కనీసం 10 సంవత్సరాల అనుభవం అవసరం.

డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే పవర్ సెక్టార్‌లో 12 సంవత్సరాల ఉద్యోగ అనుభవం తప్పనిసరి.

వయోపరిమితి

  • అసిస్టెంట్ ఇంజినీర్: గరిష్ఠంగా 40 సంవత్సరాలు

  • డిప్యూటీ జనరల్ మేనేజర్: గరిష్ఠంగా 44 సంవత్సరాలు

  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది.

జీతభత్యాలు

  • అసిస్టెంట్ ఇంజినీర్: నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు

  • డిప్యూటీ జనరల్ మేనేజర్: నెలకు రూ.90,000 నుంచి రూ.2,40,000 వరకు

  • బేసిక్ పేతో పాటు సంస్థ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు కూడా అందజేస్తారు.


ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపికను పలు దశల్లో నిర్వహిస్తారు.

  • దరఖాస్తుల పరిశీలన

  • రాత పరీక్ష

  • గ్రూప్ డిస్కషన్

  • వ్యక్తిగత ఇంటర్వ్యూ

ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం

  • ముందుగా NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

  • 'Careers' విభాగంలో సంబంధిత రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ఓపెన్ చేయాలి.

  • ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసిన వారు లాగిన్ కావాలి.

  • కొత్త అభ్యర్థులు మొబైల్ నంబర్, ఈమెయిల్‌తో నమోదు పూర్తి చేసి లాగిన్ కావాలి.

  • అవసరమైన వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేసి సంబంధిత ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి.

  • వివరాలను పరిశీలించిన తర్వాత దరఖాస్తును సమర్పించాలి.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుకు చివరి తేదీ: జులై 31, 2026 (సాయంత్రం 6 గంటల వరకు)

అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు పూర్తి చేసుకోవడం మంచిది.


Also Read:

ఒమర్ అబ్దుల్లాకు బీజేపీ లీగల్ నోటీసు.. అసలు వివాదం ఏంటి..

తగిన చర్యలు ఉంటాయి: ఎస్. కృష్ణన్

Updated Date - Jul 13 , 2026 | 03:06 PM