ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు గుడ్ న్యూస్.. NHSRCLలో టెక్నీషియన్ పోస్టులు
ABN , Publish Date - Jul 30 , 2026 | 04:10 PM
రైల్వే రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) శుభవార్త అందించింది. సంస్థలో ఖాళీగా ఉన్న 237 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: నిరుద్యోగులకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) శుభవార్త అందించింది. సంస్థలో ఖాళీగా ఉన్న 237 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఐటీఐ, డిప్లొమా అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.35,000 నుంచి రూ.1,10,000 వరకు వేతనం లభించనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 5, 2026లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
ఖాళీల వివరాలు
మొత్తం పోస్టులు: 237 టెక్నీషియన్ ఉద్యోగాలు
విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్, రోలింగ్ స్టాక్ తదితర విభాగాలు.
విద్యార్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు:
10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ తదితర విభాగాల్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
డిప్లొమా అభ్యర్థులకు సంబంధిత రంగంలో రెండేళ్ల పని అనుభవం అవసరం.
ముఖ్యమైన అర్హత నిబంధనలు
బీఈ/బీటెక్ వంటి ఉన్నత విద్యార్హతలు ఉన్నప్పటికీ, నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఐటీఐ లేదా డిప్లొమా అర్హత లేకపోతే దరఖాస్తు చేయలేరు.
అప్రెంటిస్‌షిప్, టీచింగ్, ఫ్రీలాన్సింగ్ వంటి అనుభవాలను ఉద్యోగ అనుభవంగా పరిగణించరు.
2026 జూన్ 30 నాటికి రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులను దేశంలోని ఏ ప్రాంతంలోనైనా విధులకు కేటాయించే అవకాశం ఉంటుంది.
వయోపరిమితి
అభ్యర్థుల గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం.. రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయసు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు
యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు: రూ.400
ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
జీతం, ఇతర ప్రయోజనాలు
ఎంపికైన టెక్నీషియన్లకు నెలకు రూ.35,000 నుంచి రూ.1,10,000 వరకు వేతనం అందుతుంది. దీనితో పాటు ఐడీఏ, హెచ్‌ఆర్‌ఏ, వైద్య సదుపాయాలు, ఈపీఎఫ్, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి.
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్
ఇంటర్వ్యూ
సర్టిఫికెట్ వెరిఫికేషన్
మెడికల్ టెస్ట్ ఉంటాయి. ఎంపికైన వారు ఒక సంవత్సరం ప్రొబేషన్ కాలంలో పనిచేయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీ
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 5, 2026
దరఖాస్తు విధానం
అర్హత ఉన్న అభ్యర్థులు NHSRCL అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Also Read:
ఏపీడీఏఎస్‌సీఏసీ ఎండీగా ఎం.వేణుగోపాల్ రెడ్డికి అదనపు బాధ్యతలు
కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి