IBPS భారీ నోటిఫికేషన్.. 6,715 బ్యాంకు ఉద్యోగాలు..
ABN , Publish Date - Jul 02 , 2026 | 04:20 PM
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డిగ్రీ అభ్యర్థులకు ఐబీపీఎస్ (IBPS) గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), మేనేజ్‌మెంట్ ట్రెయినీ (MT) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: బ్యాంకు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), మేనేజ్‌మెంట్ ట్రెయినీ (MT) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 6,715 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 21, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు
పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (MT)
మొత్తం ఖాళీలు: 6,715
బ్యాంకుల వారీగా ఖాళీలు
బ్యాంక్ ఆఫ్ బరోడా – 1,900
కెనరా బ్యాంక్ – 1,500
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర – 1,100
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ – 550
పంజాబ్ నేషనల్ బ్యాంక్ – 504
బ్యాంక్ ఆఫ్ ఇండియా – 500
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 500
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ – 161
విద్యార్హత
ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి
కనీస వయస్సు – 20 సంవత్సరాలు
గరిష్ఠ వయస్సు – 30 సంవత్సరాలు
వయో సడలింపు:
ఎస్సీ, ఎస్టీ – 5 సంవత్సరాలు
ఓబీసీ – 3 సంవత్సరాలు
దివ్యాంగులు – 10 సంవత్సరాలు
దరఖాస్తు ఫీజు
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు – రూ.850
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు – రూ.175
జీతభత్యాలు
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి రూ.48,480 నుంచి రూ.85,920 వరకు బేసిక్ పే లభిస్తుంది. ఇతర అలవెన్సులు అదనంగా ఉంటాయి.
ఎంపిక విధానం
అభ్యర్థులను కింది దశల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష
మెయిన్స్ పరీక్ష
పర్సనాలిటీ టెస్ట్
ఇంటర్వ్యూ
సర్టిఫికెట్ వెరిఫికేషన్
మెడికల్ పరీక్ష
పరీక్ష విధానం
ప్రిలిమినరీ పరీక్ష
మొత్తం మార్కులు – 100
పరీక్ష సమయం – 60 నిమిషాలు
విభాగాలు:
ఇంగ్లీష్ – 30 ప్రశ్నలు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ – 35 ప్రశ్నలు
రీజనింగ్ – 35 ప్రశ్నలు
మెయిన్స్ పరీక్ష
మొత్తం ప్రశ్నలు – 170
మొత్తం మార్కులు – 200
పరీక్ష సమయం – 2 గంటల 40 నిమిషాలు
విభాగాలు:
రీజనింగ్ – 40 ప్రశ్నలు
ఇంగ్లీష్ లాంగ్వేజ్ – 40 ప్రశ్నలు
జనరల్ అవేర్‌నెస్ – 50 ప్రశ్నలు
డేటా అనాలిసిస్ – 40 ప్రశ్నలు
అదనంగా ఇంగ్లీష్ ఎస్సే, కాంప్రహెన్షన్ విభాగంలో 25 మార్కులకు పరీక్ష ఉంటుంది. దీనికి 30 నిమిషాల సమయం ఉంటుంది.
ఈ పరీక్షలు ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం – జులై 1, 2026
దరఖాస్తు చివరి తేదీ – జులై 21, 2026
ప్రిలిమినరీ పరీక్ష – ఆగస్టు 2026
ప్రిలిమ్స్ ఫలితాలు – సెప్టెంబర్/అక్టోబర్ 2026
మెయిన్స్ పరీక్ష – అక్టోబర్/నవంబర్ 2026
మెయిన్స్ ఫలితాలు – నవంబర్ 2026
ఇంటర్వ్యూలు – నవంబర్/డిసెంబర్ 2026
అర్హత కలిగిన అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి అన్ని అర్హతలను పరిశీలించడం మంచిది.
Also Read:
టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు
ఈ విషయాలను యవ్వనంలోనే తెలుసుకోవాలి