నిఫ్ట్
ABN , Publish Date - Oct 26 , 2026 | 01:10 AM
ఒక వస్తువుతో కలిగే ప్రయోజనంలో ఎలాంటి మార్పులు లేకుండా కేవలం అందాన్ని జోడించడమే ఫ్యాషన్‌కు అర్థంగా చెప్పుకోవచ్చు.
ఒక వస్తువుతో కలిగే ప్రయోజనంలో ఎలాంటి మార్పులు లేకుండా కేవలం అందాన్ని జోడించడమే ఫ్యాషన్‌కు అర్థంగా చెప్పుకోవచ్చు. మనం అనునిత్యం ధరించే దుస్తులు, పాదరక్షలు, వాచీ తదితరాలన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఆ అందం, అంతకుమించి ట్రెండ్‌ను కలగలిపి కోర్సులుగా మలచిన సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్). హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఉన్న నిఫ్ట్ సెంటర్లు ఫ్యాషన్ రంగంలో వివిధ కోర్సులు - యూజీ, పీజీ, పిహెచ్‌డీని అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి ఉద్దేశించిన పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది.
యూజీ కోర్సుల కాలవ్యవధి నాలుగేళ్ళు. బ్యాచిలర్ ఆఫ్ డిజైనింగ్ అలాగే ఫ్యాషన్ టెక్నాలజీలో ఈ కోర్సులు ఉన్నాయి. ప్యాషన్ కమ్యూనికేషన్, యాక్సెసరీ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, నిట్‌వేర్ డిజైన్, లెదర్ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్, ఫ్యాషన్ ఇంటీరియర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు ఈ కోర్సు చేసేందుకు అర్హులు.
డిగ్రీ ఉత్తీర్ణులు పీజీ కోర్సులు చేసేందుకు అర్హులు. మాస్టర్స్ ఆఫ్ డిజైన్, మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్, మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి.
ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 16లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ వచ్చే ఏడాది జనవరి 10న దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో జరుగుతుంది.
వెబ్ సైట్ ; https://exams.nta.nic.in/niftee/
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలు.. ఎన్డీయే నేతల తీవ్ర ఆగ్రహం
యూపీలో దారుణం.. మరిది ప్రైవేట్ పార్ట్స్‌ను కొరికేసిన వదిన