టాపిక్స్‌పై పట్టే ప్రధానం
ABN , Publish Date - Nov 23 , 2026 | 06:23 AM
త్రివిధ దళాల్లో చేరేందుకు అవసరమైన విధంగా తర్ఫీదునిచ్చే సమున్నత విద్యా సంస్థలు మన దేశంలోని సైనిక స్కూల్స్. దేశవ్యాప్తంగా ఉన్న 113 సైనిక్ స్కూళ్లలో రాబోయే...
సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్షకు సన్నద్ధత
త్రివిధ దళాల్లో చేరేందుకు అవసరమైన విధంగా తర్ఫీదునిచ్చే సమున్నత విద్యా సంస్థలు మన దేశంలోని సైనిక స్కూల్స్. దేశవ్యాప్తంగా ఉన్న 113 సైనిక్ స్కూళ్లలో రాబోయే విద్యా సంవత్సరానికి ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాల కోసం ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) విడుదల చేసింది.- ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశంలోని అన్ని సైనిక్ స్కూళ్లలో ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పించనున్నారు. బాలురతో పాటు బాలికలకు కూడా ప్రవేశ అవకాశాలు కల్పించడమే ఈ ఏడాది నోటిఫికేషన్‌లోని ముఖ్యమైన అంశం. తొమ్మిదో తరగతిలో ప్రవేశాలు 77 సైనిక స్కూల్‌కే పరిమితం. ఈ రెండు ప్రవేశ పరీక్షలు దేశవ్యాప్తంగా వివిధ పట్టణాల్లో వచ్చే ఏడాది జనవరి 31న నిర్వహించనున్నారు.
బాలికలకు దేశవ్యాప్తంగా కేటాయించిన మొత్తం సీట్ల సంఖ్యను కచ్చితంగా తెలుసుకునేందుకు ఆ సైనిక్ స్కూళ్లకు సంబంధించిన విడివిడి సీట్ల పట్టికలను పరిశీలించాలి.
ఆరో తరగతిలో ప్రవేశానికి ఉద్దేశించిన పరీక్ష తెలుగు, ఇంగ్లీష్, హిందీ సహా 13 భాషల్లో జరుగుతుంది. ఈ టెస్ట్‌లో లాంగ్వేజ్‌లో 25 ప్రశ్నలు 50 మార్కులకు, మ్యాథమెటిక్స్(50 - 150), ఇంటెలిజెన్స్(25 - 50), జనరల్ నాలెడ్జ్(25-50) ఉంటాయి. మొత్తం 125 ప్రశ్నలు - 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష కాలవ్యవది రెండున్నర గంటలు.
తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష కేవలం ఇంగ్లీష్ మాధ్యమంలోనే ఉంటుంది. ఇది మూడు గంటల పరీక్ష. ఇందులో మ్యాథమెటిక్స్ 50-200, ఇంటెలిజెన్స్ 25-50, ఇంగ్లీష్ 25-50, జనరల్ సైన్స్ 25-50, సోషల్ సైన్స్ 25-50 మొత్తం 150 ప్రశ్నలు - 400 మార్కులకు ఉంటుంది.
ఎస్.కల్యాణి, క్రాంతి కీన్ స్కూల్,
దమ్మాయిగూడ, హైదరాబాద్
ప్రిపరేషన్ టిప్స్
ఆరో తరగతిలో ప్రవేశానికి 4, 5 తరగతులకు చెందిన ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను పూర్తిగా చదివి ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. అలాగే తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి సంబంధించి 7, 8 తరగతులకు చెందిన ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను పూర్తిగా చదవాలి.
గణితంలో కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు, భిన్నాలు, దశాంశాలు సాధన చేయాలి. ముఖ్యంగా పద సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
గణితంలో పద సమస్యలను ఎక్కువగా సాధన చేయాలి. సమస్యను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని, వేగాన్ని పెంచాలి. మంచి మార్కులు సాధించడానికి ఇది సహాయపడుతుంది.
రీజనింగ్‌లో సంఖ్యా శ్రేణులు, సారూప్యత, దిశలు, సంకేత భాష వంటి ప్రశ్నలను సాధన చేయాలి.
ఆంగ్లంలో వ్యాకరణం, పదజాలం, పర్యాయపదాలు, వ్యతిరేక పదాలు, పఠన అవగాహనపై దృష్టి పెట్టాలి.
జనరల్ నాలెడ్జ్‌లో చరిత్ర, భూగోళశాస్త్రం, సెన్స్, ముఖ్యమైన రోజులు, సమకాలీన అంశాలు(కరెంట్ అఫైర్స్) చదవాలి.
తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి సంబంధించి సదరు సబ్జెక్టులను ఆసాంతం చదివి అర్థం చేసుకోవాలి. అప్పుడే ప్రశ్న ఎట్నుంచి ఎటు అడిగినప్పటికీ సమాధానాన్ని సులువుగా గుర్తించగలుగుతారు.
పరీక్షలో ముందుగా సులభమైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. కఠినమైన ప్రశ్నలపై ఎక్కువ సమయం వృథా చేయకూడదు. సమయపాలన (టైమ్ మేనేజ్‌మెంట్) చాలా ముఖ్యం.
నిర్దేశిత సిలబ్‌సపై పట్టు సాధించిన తరవాత మాక్ టెస్టులు రాయాలి. పాత ప్రశ్నపత్రాలు, నమూనా పరీక్షలు నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా సాధన చేయాలి. అదే సమయంలో చేసిన తప్పులను గుర్తించి వాటిని సవరించుకోవాలి. అవే తప్పులు పదేపదే జరగకుండా చూసుకోవాలి.
రోజువారీ పునశ్చరణ తప్పనిసరి. ప్రతిరోజూ చదివిన అంశాలను పునశ్చరణ చేసుకోవాలి. అన్ని టాపిక్స్ రోజూ కవర్ అయ్యేలా చూసుకోవాలి. తప్పులను ఎప్పటికప్పుడు గుర్తించి సరిదిద్దుకోవాలి. పదేపదే ప్రాక్టీ ్‌సతో ఒక సబ్జెక్టుపై, చివరగా మొత్తం పరీక్షపై పట్టు లభిస్తుంది. అప్పుడే ఎలాంటి భయం లేకుండా పరీక్ష రాయవచ్చని గ్రహించాలి.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్
భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్