ఏఎఫ్ క్యాట్
ABN , Publish Date - Nov 23 , 2026 | 06:19 AM
ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏఎఫ్ క్యాట్)కు నోటిఫికేషన్ వెలువడింది. పర్మినెంట్ అలాగే షార్ట్ సర్వీస్ కమిషన్ నియామకాల...
ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏఎఫ్ క్యాట్)కు నోటిఫికేషన్ వెలువడింది. పర్మినెంట్ అలాగే షార్ట్ సర్వీస్ కమిషన్ నియామకాల కోసం దీనిని ఉద్దేశించారు. ఈ ప్రక్రియలో భాగంగా మొదటి టెస్ట్‌ను 2027 జనవరి 31న ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.
ఫ్లయింగ్‌లో షార్ట్ సర్వీస్ కమిషన్ కింద 36(పురుషులకు 28, మహిళలకు 8) పోస్టులు ఉన్నాయి.
గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్) పరిధిలో 124 ఏరోనాటికల్ ఇంజనీర్(ఎలకా్ట్రనిక్స్ 88, మెకానికల్ 36) పోస్టులు ఉన్నాయి.
గ్రౌండ్ డ్యూటీ(నాన్-టెక్నికల్) పరిధిలో 108 పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా వెపన్స్ సిస్టమ్(పురుషులు 25, మహిళలు 5), అడ్మినిస్ట్రేషన్ (పురుషులు 35, మహిళలు 18), లాజిస్టిక్స్ (పురుషులు 7, మహిళలు 4), అకౌంట్స్ (పురుషులు 4, మహిళలు 4), ఎడ్యుకేషన్ (పురుషులు 2, మహిళలు 2), మీటియోరాలజీ (పురుషులు 1, మహిళలు 1) పోస్టులు ఉన్నాయి.
ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ కోసం ఫ్లయింగ్ బ్రాంచ్‌లో సీడీఎస్‌ఈ ఖాళీల నుంచి పది శాతం పీసీ (ఎం), ఎఫ్‌క్యాట్ ఖాళీల నుంచి పది శాతం ఎస్‌ఎస్‌సీ (పురుషులు, మహిళలు)కి కేటాయించారు.
గేట్ స్కోర్ ఎంట్రీ(గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్) పరిధిలో 16 పోస్టులు ఉన్నాయి.
ఏరోనాటికల్ ఇంజనీర్(ఎలకా్ట్రనిక్స్: పురుషులు 7, మహిళలు 4); మెకానికల్ (పురుషులు 3, మహిళలు 2) పోస్టులు ఉన్నాయి.
పోస్టును అనుసరించి నిర్దేశిత అర్హతలు కలిగి ఉండాలి. ఎఫ్‌క్యాట్‌లో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ పరీక్షలకు పిలుస్తారు. అక్కడ రెండు దశల్లో టెస్టులు ఉంటాయి. చివరగా వైద్య పరీక్షలు కూడా నిర్వహించి తుది ఎంపిక జరుపుతారు.
ఆఖరు తేదీ: డిసెంబరు 11
వెబ్‌సైట్: https://afcat.edcil.co.in
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్
భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్