Share News

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల ఎప్పుడంటే..?

ABN , Publish Date - Jun 17 , 2026 | 05:17 PM

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల ఎప్పుడంటే..?
intermediate supplementary results 2026

అమరావతి, జూన్17: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫలితాలు గురువారం (18-06-2026) మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం వెల్లడించింది. ఈ రెండేళ్లకు సంబంధించిన 12.50 లక్షల జవాబుపత్రాలు వ్యాల్యేషన్ జూన్ 15వ తేదీతో ముగిసిందని వివరించింది. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ https://bie.ap.gov.in/లో హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు వివరించింది.

Updated Date - Jun 17 , 2026 | 05:20 PM