Share News

కొన్ని గంటల్లో ముగియనున్న గడువు.. ఈ ఉద్యోగానికి అప్లై చేశారా?

ABN , Publish Date - Oct 25 , 2026 | 09:12 AM

ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యూడీషియల్ల సర్వీస్ పరిధిలో ఖాళీగా ఉన్న 119 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు విడుదల చేసిన నోటిఫికేషన్ గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది.

కొన్ని గంటల్లో ముగియనున్న గడువు.. ఈ ఉద్యోగానికి అప్లై చేశారా?

ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యూడీషియల్ల సర్వీస్ పరిధిలో ఖాళీగా ఉన్న 119 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు విడుదల చేసిన నోటిఫికేషన్ గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, సంబంధిత ప్రభుత్వ/ జ్యుడీషియరీ శాఖల్లో సేవలందిస్తున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల భర్తీని మూడంచెల ప్రక్రియలో ఎంపిక చేస్తారు.


తొలి దశలో 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో కనీసం 40 శాతం మార్కులు సాధించిన వారిని 1:10 నిష్పత్తిలో ప్రధాన వ్రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో 3 పేపర్లు.. సివిల్ లాస్ (పేపర్ 1), క్రిమినల్ లాస్ (పేపర్ 2), ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్/ వ్యాసరచన (పేపర్ 3) ఉంటాయి (ప్రతి పేపర్ 100 మార్కులు).


అనంతరం 1: నిష్పత్తిలో 50 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహించి.. తుది ఎంపిక చేపడతారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.77,840 నుంచి రూ.1,36,520 వరకు జీతం ఉంటుంది. అర్హతీ ఉన్న అభ్యర్థులు రేపటి లోపు.. అక్టోబర్ 26వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఏపీ హైకోర్టులో 119 సివిల్ జడ్జి పోస్టులు.. రూ.1.36 లక్షల వరకు జీతం

Updated Date - Oct 25 , 2026 | 09:19 AM