హరప్పా మన పురాణాలలో చరిత్ర
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:50 AM
మోహెంజోదారో అసలు పేరు ఏమిటి? -ఆర్యులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు?, -దేవాసురులు నాటి అద్భుత కల్పనలోని పాత్రలేనా? -మహాభారత యుద్ధం...
పుస్తకావిష్కరణ
మోహెంజోదారో అసలు పేరు ఏమిటి? -ఆర్యులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు?, -దేవాసురులు నాటి అద్భుత కల్పనలోని పాత్రలేనా? -మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది?... ఈ ప్రశ్నలన్నీ చర్చించుకుందాం. హరప్పా చరిత్రకు సంబంధించిన ఎగ్జిబిషన్‌తో పాటు సాయి పాపినేని రచన ‘మన పురాణాలలో హరప్పా చరిత్ర’ పుస్తకం ఆవిష్కరణలో భారతీయులకు పరిచయం ఉన్న కథలూ, గాథలూ, అతి ప్రాచీన నాగరికతలలో పెద్దదైన హరప్పా నాగరికత నేపథ్యంలో చర్చించుకుందాం.
వాడ్రేవు చిన వీరభద్రుడు పుస్తక పరిచయం చేశాక, రచయిత సాయి పాపినేని, సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత ప్రసాద్ సూరి, తెలుగు కలెక్టివ్ ఆదిత్య అన్నవజ్ఘుల కలిసి హరప్పా గురించిన చర్చ జరుపుతారు, పాఠకులతో సంభాషణ చేస్తారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆగస్టు 30వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ కార్యక్రమం.
అజు పబ్లికేషన్స్
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో చూస్తే.. అవాక్కవుతారు..
రైల్వే ట్రాక్‌పై చిక్కుకుపోయిన ఒంటె.. వీడియో వైరల్
For More National News And Telugu News