ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Aug 21 , 2026 | 08:34 AM
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలిపారు. వరలక్ష్మీ దేవి ఆశీస్సులు ఏపీ ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పాడిపంటలు, సుఖసంతోషాలతో రాష్ట్రమంతా సంతోషంగా ఉండాలని దేవిని కోరుకున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలిపారు. వరలక్ష్మీ దేవి ఆశీస్సులు ఏపీ ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పాడిపంటలు, సుఖసంతోషాలతో రాష్ట్రమంతా సంతోషంగా ఉండాలని దేవిని కోరుకున్నారు. ఈ పండుగ మహిళలందరికీ శుభాలు, శాంతిని చేకూర్చాలని ముఖ్యమంత్రి అభిలషించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు పోస్టు చేశారు.
సీఎం చంద్రబాబు ఎక్స్ పోస్టు..
'వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. సిరిసంపదలకు, సౌభాగ్యానికి, సకల శుభాలకు అధిదేవతైన ఆ వరలక్ష్మీ దేవి దివ్య ఆశీస్సులు మన రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. పాడిపంటలతో, సుఖసంతోషాలతో రాష్ట్రం సుభిక్షంగా, సమృద్ధిగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. కుటుంబ సౌభాగ్యం కోసం శ్రమించే మహిళామూర్తులందరికీ ఈ పవిత్ర పండుగ విశేషమైన శుభాలను, శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అందరికీ మరొక్క మారు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుభాకాంక్షలు' అంటూ సీఎం చంద్రబాబు పోస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్.. ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు..
దక్షిణాది ప్రగతికి కలిసి కదులుదాం