Share News

టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో..

ABN , Publish Date - Nov 02 , 2026 | 04:21 PM

ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు పదవీకాలం ముగిసింది. ఈ మేరకు టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 658 జారీ చేసింది. స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్‌గా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రను నియమించింది.

టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో..
TTD Specified Authority

అమరావతి: ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ట్రస్ట్ బోర్డు పదవీకాలం ముగిసింది. ఈ మేరకు టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 658 జారీ చేసింది. ఈ అథారిటీ చైర్మన్‌గా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర (IAS), అలాగే సభ్యులుగా ఆర్థిక శాఖ కార్యదర్శి వి.వినయ్ చంద్, దేవదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ట్రస్ట్ బోర్డు ఏర్పాటయ్యే వరకు లేదా ఏడాది పాటు ఈ అథారిటీ కొనసాగనుంది. టీటీడీ ధర్మకర్తల మండలికి ఉండే అన్ని అధికారాలు, విధులను దీనికి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.


కాగా, టీటీడీ ట్రస్ట్ బోర్డు పదవీకాలం ముగియడంతో నూతన పాలకమండలిని నియమించాల్సి ఉంది. సాధారణంగా టీటీడీ బోర్డు పదవీకాలం ముగిసిన వెంటనే నూతన పాలకవర్గాన్ని ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఏపీలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీని కారణంగా నియామకానికి ఆటంకం ఏర్పడింది. దీంతో తాత్కాలిక ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వామివారి కైంకర్యాలు, భక్తుల సౌకర్యాలు, దేవస్థానం నిత్యపాలన, రథసప్తమి వంటి కీలక ఉత్సవాల నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంది. ఈ మేరకు టీటీడీ పాలన కోసం ఐఏఎస్ అధికారులతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీని నియమిస్తూ జీవో జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తున్న మురసు తుఫాన్.. అప్రమత్తంగా ఉండాలన్న ప్రఖర్ జైన్..

రాప్తాడు నిందితుడిపై కాల్పుల ఘటన.. హైకోర్టుకు న్యాయవాదులు..

Updated Date - Nov 02 , 2026 | 04:30 PM