Magh Mela 2026: ప్రయోగరాజ్‌లో మాఘ మేళా ప్రారంభం.. త్రివేణీ సంగమంలో భక్తుల పుణ్య స్నానాలు
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:32 AM
ఈ రోజు(శనివారం) నుంచి మాఘమేళా ప్రారంభమైంది. మాఘ మేళాలో మొదటి రోజు, దట్టమైన పొగమంచు చల్లని గాలులను లెక్కచేయకుండా లక్షల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌లోని సంగం జిల్లాల్లో పవిత్ర స్నానమాచరించానికి తరలి వస్తున్నారు.
అలహాబాద్: ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మాఘ మేళ హిందువులకు అత్యంత పవిత్రమైన ఉత్సవాలలో ఒకటి. గత ఏడాది యూపీలో మహా కుంభమేళ జరిగింది. కోట్ల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించారు. మాఘ మేళా ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి ప్రారంభమై మహా శివరాత్రి వరకు కొనసాగుతుంది. గంగా, యమునా, అంతర్వాహిని అయిన సరస్వతి నదులు కలిపే త్రివేణి సంగమం వద్ద ఈ మేళా జరుగుతుంది. ఈ పవిత్ర జలాల్లో స్నానం చేస్తే పాపాలు తొలగిపోయి, మోక్షం అభిస్తుందని.. పరమశివుడి ఆశిస్సులు లభిస్తాయని భక్తుల నమ్మకం.
ఈ ఏడాది మాఘ మేళాకు 12-15 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. గత ఏడాది మహా కుంభమేళా తర్వాత జరుగుతున్న అతి పెద్ద మేళాగా భావిస్తున్నారు. మొదటిసారిగా, హెలికాప్టర్, పారాగ్లైడింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, ప్రముఖ కళాకారులు మేళా వేదిక వద్ద ప్రదర్శనలు ఇస్తారని ప్రయాగ్‌రాజ్ డివిజనల్ కమిషనర్ సౌమ్య అగర్వాల్ తెలిపారు. మాఘ మేళా లో స్నానం చేయడానికి శుభప్రదమైన తేదీల గురించి తెలుసుకుందాం. జనవరి 3న పూర్ణమ, జనవరి 14న మకర సంక్రాంతి, జనవరి 18న మౌని అమావాస్య, జనవరి 23న వసంత పంచమి, ఫిబ్రవరి 1 మాఘ పూర్ణిమ, జనవరి 15 మహా శివరాత్రి.
మౌని అమావాస్య రోజున మాఘ మేళాలో పాల్గొని పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం చేయడం ఎంతో మంచిదని భక్తుల నమ్మకం. అందుకే మౌని అమావాస్య రోజున కోట్లాది మంది భక్తులు సంగమంలో స్నానం చేస్తారు. ఈ మేళాలో దేశం నలుమూలల నుండి సాధువుల, నాగా సాధువులు, పీఠాధిపతులు వస్తారు. రాత్రి వేళల్లో గంగా హారతి, భక్తి సంకీర్తనలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికత శోభతో విరాజిల్లుతుంది.
ఇవి కూడా చదవండి:
Lord Hanuman: హనుమంతుడిని సంకట మోచనుడు అని ఎందుకు అంటారు?
పర్యాటకులను కట్టిపడేస్తున్న వంజంగి, లంబసింగి అందాలు..