Vanjangi Lambasingi: పర్యాటకులను కట్టిపడేస్తున్న వంజంగి, లంబసింగి అందాలు..
ABN, Publish Date - Dec 26 , 2025 | 06:47 PM
ప్రస్తుతం వరుస సెలవులు ఉండడంతో పర్యాటకులు వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి వారికి సుదూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా.. ఏపీలోనే అందమైన ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో..
1/7
ప్రస్తుతం వరుస సెలవులు ఉండడంతో పర్యాటకులు వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి వారు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా.. ఏపీలోనే అందమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో వంజంగి, లంబసింగి ప్రాంతాలు ఒకటి. ప్రస్తుతం విపరీతమైన చలి ఉండడంతో ఈ ప్రాంతాలు మరింత అందాన్ని సంతరించుకున్నాయి. (ఫొటో జర్నలిస్ట్: హరి ప్రేమ్)
2/7
అల్లూరి జిల్లాలోని వంజంగి కొండలు కొత్త అందాన్ని సంతరించుకున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి తరలివచ్చారు. వంజంగి పాడేరుకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి కొండలపై కురిసే మంచు కాశ్మీర్‌ను తలపిస్తోంది. ఐదు కిలోమీటర్లు నడక అనంతరం కొండపై కనిపించే దృశ్యాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. (ఫొటో జర్నలిస్ట్: హరి ప్రేమ్)
3/7
విశాఖకు 135 కిలోమీటర్ల దూరంలో చింతపల్లి మండలంలో ఉన్న లంబసింగిలో కూడా అనేక అందమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కశ్మీర్, సిమ్లాకు వెళ్లే పని లేకుండా.. ఇక్కడి ప్రాంతాలను చూస్తే అక్కడి అనుభూతి కలుగుతుంది. ప్రస్తుతం చలికాలం కావడంతో ఇక్కడి ప్రకృతి అందాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. (ఫొటో జర్నలిస్ట్: హరి ప్రేమ్)
4/7
లంబసింగిలోని అందమైన పర్వతాలు, అడవులు, సెలయేళ్లు వింత అనుభూతిని కలిగిస్తాయి. హైదరాబాద్ నుంచి వెళ్లే వారు రైలు, బస్సు, విమానం ద్వారా విశాఖపట్నానికి చేరుకుని అక్కడి నుంచి లంబసింగికి చేరుకోవచ్చు. (ఫొటో జర్నలిస్ట్: హరి ప్రేమ్)
5/7
ఉదయం చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద పర్యాటకులు ప్రకృతి సౌందర్యాన్ని వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ప్రస్తుతం లంబసింగికి పర్యాటకులు తరలివస్తుంటారు. (ఫొటో జర్నలిస్ట్: హరి ప్రేమ్)
6/7
లంబసింగిలోని తాజంగి జలాశయం, యర్రవరం జలపాతం సాయంత్రం వరకు పర్యాటకులతో రద్దీ కనిపిస్తుంటుంది. (ఫొటో జర్నలిస్ట్: హరి ప్రేమ్)
7/7
లంబసింగిలో ఉదయం 5 గంటల నుంచే పర్యాటకుల రద్దీ కనిపిస్తుంది. అందులోనూ ప్రస్తుతం మంచు కురుస్తుండడంతో పర్యాటకుల రద్దీ మరింత పెరిగింది. (ఫొటో జర్నలిస్ట్: హరి ప్రేమ్)
Updated at - Dec 26 , 2025 | 07:38 PM