Share News

జేష్ఠ్య పౌర్ణమి.. ఆ రోజు ఇలా చేస్తే..

ABN , Publish Date - Jun 28 , 2026 | 09:54 AM

ఏడాదిలో ప్రతి పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. జూన్ 29వ తేదీ సోమవారం తెల్లవారుజామున 3.06 గంటలకు పౌర్ణమి ప్రారంభమవుతుంది. జూన్ 30వ తేదీ మంగళవారం ఉదయం 5.26 గంటలకు ఈ ఘడియలు ముగుస్తాయి.

జేష్ఠ్య పౌర్ణమి.. ఆ రోజు ఇలా చేస్తే..
Jyeshtha Purnima

ఇంటర్నెట్ డెస్క్: ఏడాదిలో ప్రతి పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత పవిత్రమైనదని పండితులు చెబుతున్నారు. జూన్ 29వ తేదీ సోమవారం తెల్లవారుజామున 3.06 గంటలకు పౌర్ణమి ప్రారంభమవుతుంది. జూన్ 30వ తేదీ మంగళవారం ఉదయం 5.26 గంటలకు ఈ ఘడియలు ముగుస్తాయి. ఈ రోజు స్నానాలు, దానాలు, సత్యనారాయణ స్వామి వ్రతం, శివ, విష్ణు ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని అంటున్నారు. ఈ రోజు స్నానాలు, దానాలు, ఉపవారం పాటిస్తే ఎంతో పుణ్యం లభిస్తోందని పేర్కొంటున్నారు. పురాణాల ప్రకారం.. ఆ రోజు చేసే పనులు అనేక రెట్ల ఫలితాన్ని ఇస్తాయని వారు వివరిస్తున్నారు.


చంద్రుడికి అర్ఘ్యం..

చంద్రోదయం తర్వాత పాలతో కలిపిన నీటిని లేదా స్వచ్ఛమైన నీటిని చంద్రుడికి సమర్పించి మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే మానసిక ప్రశాంతత లభిస్తుంది.

విష్ణు, లక్ష్మీదేవి పూజ..

విష్ణువు, లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేస్తే మంచిది.

తులసి పూజ..

ఇంట్లో తులసి మొక్కకు నీరు పోసి, దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయాలి. దీంతో కుటుంబంలో శాంతి, శ్రేయస్సు కలుగుతాయి.


సత్యనారాయణ వ్రతం..

సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే.. మంచి ఫలితాలు పొందుతారు.

పిృత తర్పణం..

పితృదేవతను స్మరిస్తూ తర్పణం చేయడం వల్ల వారి ఆశీర్వాదం లభిస్తుంది.

రావి చెట్టు పూజ..

రావి చెట్టు వద్ద నీళ్లు పోసి, దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే.. విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది.


గాయాత్రీ మంత్రం..

గాయత్రీ మంత్రం లేదా ఓం నమో నారాయణాయ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఆధ్యాత్మిక శాంతి కలుగుతుంది.

పశుపక్ష్యాదులకు ఆహారం

ఆవులకు పచ్చ గడ్డి, పక్షులకు ధాన్యం, కుక్కలకు ఆహారం అందిస్తే పుణ్యం కలుగుతుంది.

దానాలు..

బియ్యం, గోధుమలు, నువ్వులు, మట్టి కుండలు, వస్త్రాలు, అన్నదానం, పండ్లు దానం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.


జోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారు.. ఈ దానం చేయాలని పండితులు చెబుతున్నారు.

మేష రాశి..

ఎరుపు రంగు వస్త్రాలు, బియ్యం, పప్పులు దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

వృషభరాశి..

పెరుగు, నెయ్యి, పంచదార, వెన్న దానం చేయాలి. దీని వల్ల శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని విశ్వసిస్తారు.

మిథునరాశి..

గోమాతకు పచ్చి గడ్డి వేయాలి. గోశాలకు విరాళం ఇస్తే మంచిది. పాలు లేదా బియ్యం దానం చేయడం వల్ల వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది.

కర్కాటకరాశి..

పాలు, పెరుగు, అన్నం, పంచదార దానం చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి, కుబేరుని ఆశీస్సులు లభిస్తాయి.


సింహరాశి..

గోధుమలు, బెల్లం దానం చేయడం వల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభించి.. గ్రహస్థితులు అనుకూలంగా మారతాయి.

కన్యరాశి..

పండ్లు, కూరగాయలు, బియ్యం దానం చేయడం శుభప్రదం. విష్ణుమూర్తి కటాక్షం లభిస్తుంది.

తులారాశి..

తెల్లని వస్త్రాలు, అన్నదానం, పాలు, బియ్యం, నెయ్యి దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

వృశ్చికరాశి..

ఎరుపు రంగు వస్త్రాలు దానంగా ఇవ్వాలి. పాదచారులకు పండ్ల రసం లేదా చల్లని పానియం అందించాలి. దీని వల్ల శుభఫలితాలు కలుగుతాయి. గ్రహదోషాలు తగ్గుతాయి.


ధనస్సురాశి..

కుంకుమ కలిపిన పాలు పేదలకు పంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతాయి.

మకరరాశి..

గొడుగు, చెప్పులు దానంగా ఇవ్వాలి. అలాగే ప్రవహించే నీటిలో బియ్యం సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. దీని వల్ల గ్రహ దోషాలు తొలగి.. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.

కుంభరాశి..

అన్నదానం, నల్ల నువ్వులు, నలుపు రంగు వస్త్రాలు దానం చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి.

మీనరాశి..

మహాలక్ష్మీదేవిని పూజించి.. బ్రాహ్మణులకు లేదా అర్హులైన వారికి పసుపు వస్తువులు, పుస్తకాలు, తేనే దానం చేయడం వల్ల శుభం కలుగుతాయి. ఇలా చేయడం వల్ల జీవితంలో శుభాలు జరిగి, ఐశ్వర్యం పెరుగుతుంది.

Updated Date - Jun 28 , 2026 | 10:12 AM