Share News

భారత్‌లో కనిపించిన నెలవంక.. రేపే రంజాన్

ABN , Publish Date - Mar 20 , 2026 | 08:55 PM

భారత్‌లో నెలవంక కనిపించింది. దీంతో దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు శనివారం రోజున పవిత్ర రంజాన్ వేడుకలు నిర్వహించుకోనున్నారు.

భారత్‌లో కనిపించిన నెలవంక.. రేపే రంజాన్
Ramadan

ఇంటర్నెట్ డెస్క్: ముస్లింల పవిత్ర పండుగ రంజాన్(ఈద్-ఉల్-ఫితర్)‌కు వేళైంది. భారత్‌లో శుక్రవారం సాయంత్రం నెలవంక కనిపించింది. దీంతో దేశవ్యాప్తంగా శనివారం(మార్చి 21న) రంజాన్ పండుగను నిర్వహించుకునేందుకు ముస్లిం సోదరులు సన్నద్ధమవుతున్నారు. పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షల అనంతరం ఈ వేడుకను జరుపుకోనున్నారు ముస్లిం సోదరులు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ 'ఈద్-ఉల్-ఫితర్‌' అని ముస్లింలు భావిస్తారు.

వాస్తవానికి శుక్రవారమే రంజాన్ ఉంటుందని తొలుత అంతా భావించారు. కానీ ముందురోజు నెలవంక కనిపించకపోవడంతో ప్రభుత్వం నేడు సాధారణ పని దినంగా ప్రకటించింది. అయితే.. వెంటనే పరిస్థితిని పరిశీలించిన ప్రభుత్వం రంజాన్ పండుగను శనివారం జరుపుకోవాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా శనివారం అధికారికంగా సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విద్యార్థులకు వరుసగా రెండు రోజులపాటు సెలవులు లభించాయి. శనివారం రంజాన్ సెలవు, ఆదివారం సాధారణ సెలవు కలిపి రెండు రోజుల విరామం దక్కింది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు విశ్రాంతి తీసుకోవడానికి మంచి అవకాశం దక్కినట్టైంది. ముఖ్యంగా పరీక్షల ఒత్తిడిలో ఉన్న పిల్లలకు ఈ విరామం చాలా ఉపయుక్తం కానుంది.


ఇవీ చదవండి:

ముస్లిం సోద‌రుల‌కు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం

టీఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన మమతా బెనర్జీ

Updated Date - Mar 20 , 2026 | 09:14 PM