Share News

ఛత్తీస్‌గఢ్‌లో అమానుషం.. గర్భిణిని దారుణంగా చంపిన భర్త..

ABN , Publish Date - May 17 , 2026 | 07:01 PM

ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 23 ఏళ్ల గర్భిణిని ఆమె భర్త అమానుషంగా హింసించి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేశాడు.

ఛత్తీస్‌గఢ్‌లో అమానుషం.. గర్భిణిని దారుణంగా చంపిన భర్త..
pregnant woman killed

ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 23 ఏళ్ల గర్భిణిని ఆమె భర్త అమానుషంగా హింసించి హత్య చేశాడు. భార్యను పాశవికంగా చంపేసి ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేశాడు. అసలు విషయం బయటపడడంతో నిందితుడు పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు (Chhattisgarh Crime News).


సకారియా గ్రామానికి చెందిన హీరాబాయిపై ఆమె భర్త ప్రదీప్ అగారియా మే 14న తీవ్రంగా దాడి చేశాడు. ఇనుప రాడ్లతో ఆమె తలపై కొట్టి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని బైక్‌కు కట్టి అంబికాపూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. రోడ్డు ప్రమాదంలో తన భార్య ప్రాణాలు కోల్పోయిందని చెప్పాడు. పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు అసలు విషయం బయటపెట్టారు. ఆమె శరీరంపై 17కిపైగా తీవ్రమైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. తలకు బలమైన దెబ్బలు తగలడంతో కపాలం పగిలినట్లు ఫోరెన్సిక్ అధికారులు వెల్లడించారు (Pregnant woman killed).


బాధితురాలి శరీరంలో నుంచి ఇనుప వస్తువును స్వాధీనం చేసుకున్నట్లు ఫోరెన్సిక్ విభాగం తెలిపింది (Pregnant woman torture case). ఈ హింస కారణంగానే గర్భంలోని శిశువు కూడా మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడు పరారయ్యాడు. ప్రదీప్ అగారియా హింసాత్మక ప్రవృత్తి కలిగి ఉండేవాడని, తరచుగా భార్యపై దాడి చేసే వాడిని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ప్రదీప్, హీరబాయి జంటకు నలుగురు పిల్లలు ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

జోధ్‌పూర్‌లో దారుణం.. సామూహిక అత్యాచారం, బెదిరింపులతో ఇద్దరి ఆత్మహత్య..


మరో వివాదంలో కాశ్ పటేల్.. ప్రేయసితో డేట్ కోసం ఎంత ఖర్చంటే..

Updated Date - May 17 , 2026 | 07:01 PM