జాతీయ ఫుట్ బాల్ ప్లేయర్ ఇంటిపై అల్లరి మూకల దాడి..
ABN , Publish Date - Mar 28 , 2026 | 08:52 PM
జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న క్రీడాకారిణితో కొందరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. కుక్క విషయంలో మొదలైన గోడవ చివరకు క్రీడాకారిణి కుటుంబానికి ప్రాణభయంగా మారింది. కొందరు మందుబాబులతో క్రీడాకారిణికి కుక్క విషయంలో గొడవ జరిగింది.
జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న క్రీడాకారిణితో కొందరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. కుక్క విషయంలో మొదలైన గోడవ చివరకు క్రీడాకారిణి కుటుంబానికి ప్రాణభయంగా మారింది. కొందరు మందుబాబులతో క్రీడాకారిణికి కుక్క విషయంలో గొడవ జరిగింది. దీంతో వారు ఆమెను వేధించడం ప్రారంభించారు (National football player attack).
హయత్ నగర్ పరిధిలో నివసిస్తున్న ఆమె ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి క్రీడాకారిణి, ఆమె చెల్లెళ్లతో అసభ్యంగా ప్రవర్తించారు (Crime News). రోజూ వారి ఫోటోలు తీసి వేధిస్తున్నారు. మందుబాబుల దాడిలో గాయపడిన క్రీడాకారిణి హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో హయత్‌నగర్ పోలీసులు నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభిచారు.
ఇవి కూడా చదవండి..
మోదీ-ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్.. కేంద్ర ప్రభుత్వం స్పందన ఏంటంటే..
ఇరాన్‌పై భూతల దాడులు చేసే ఉద్దేశం లేదు.. అమెరికా విదేశాంగ మంత్రి..