ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న మరో ఫ్యాక్టరీ సీజ్..
ABN , Publish Date - Mar 28 , 2026 | 08:41 PM
హైదరాబాద్‌లో చాలా మంది ఉస్మానియా బిస్కెట్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. టీతో పాటు ఉస్మానియా బిస్కెట్లు తినడం హైదరాబాదీలకు ఎప్పట్నుంచో ఉన్న అలవాటు. అయితే కొందరు వ్యక్తులు కల్తీ ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు.
హైదరాబాద్‌లో చాలా మంది ఉస్మానియా బిస్కెట్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. టీతో పాటు ఉస్మానియా బిస్కెట్లు తినడం హైదరాబాదీలకు ఎప్పట్నుంచో ఉన్న అలవాటు. అయితే కొందరు వ్యక్తులు నాసిరకం ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. ఇప్పటికే అలాంటి ఓ పరిశ్రమను పోలీసులు సీజ్ చేశారు. తాజాగా మరో ఫ్యాక్టరీని కూడా సీజ్ చేశారు (Osmania biscuits factory seized).
హైదరాబాద్‌లోని కేడీ కాలనీ పరిధిలో ఎటువంటి అనుమతులూ లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో నడుస్తున్న ఉస్మానియా బిస్కెట్ల తయారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. భారీ మొత్తంలో నిల్వ ఉంచిన బేకరీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. అహ్మద్ రజా అనే వ్యక్తి పూర్తి అపరిశుభ్ర వాతావరణంలో, నాసిరకం ముడి సరుకులతో ఉస్మానియా బిస్కెట్లను తయారు చేస్తున్నాడు (Illegal biscuit manufacturing).
ఆ ఉత్పత్తులను నగరంలోని వివిధ కిరాణా షాప్‌లు, హోటళ్లు, బేకరీలు, కేఫ్స్‌లకు సరఫరా చేస్తున్నాడు (Hyderabad food inspections). ఈ విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ టీమ్ అతడి తయారీ కేంద్రంపై దాడి చేసింది. అక్కడ ఉన్న యంత్రాలను, ముడి పదార్థాలను, ఉత్పత్తులను స్వాధీనం చేసుకుంది. అహ్మద్ రజాను అరెస్ట్ చేసింది.
ఇవి కూడా చదవండి..
మోదీ-ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్.. కేంద్ర ప్రభుత్వం స్పందన ఏంటంటే..
ఇరాన్‌పై భూతల దాడులు చేసే ఉద్దేశం లేదు.. అమెరికా విదేశాంగ మంత్రి..