Share News

Hyderabad: రక్తసంబంధీకులే అంతమొందిస్తున్నారు...

ABN , Publish Date - Jan 06 , 2026 | 09:39 AM

మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. స్నేహితులే పగబడుతున్నారు. చిన్నచిన్న ఘర్షణలను మనసులో పెట్టకొని ఏకంగా ప్రాణాలనే తీస్తున్నారు. అలాగే... అక్రమ సంబంధాల వ్యవహారాల్లో ఇటీవల హత్యలు ఎక్కువయ్యాయి.

Hyderabad: రక్తసంబంధీకులే అంతమొందిస్తున్నారు...

- స్నేహితులే పగబడుతున్నారు.. మంటగలుస్తున్న మానవ సంబంధాలు

- ఆర్థిక మోసాలు, అక్రమ సంబంధాలతోనే హత్యలు

- నమ్మకంతో కలిసి బతకాలి

- లేదంటే వెళ్లిపోవాలి.. చంపుకోవద్దు: సీపీ సజ్జనార్‌

హైదరాబాద్‌ సిటీ: కొద్దిరోజుల క్రితం గర్భవతి అయిన భార్యను అనుమానంతో భర్త అంతమొందించాడు. ఆమెను చంపేసి మృతదేహాన్ని రంపంతో కోసి ముక్కలుగా చేసి మూటలో గట్టి మూసీలో పడేశాడు. మేడిపల్లి(Medipally) పరిధిలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆస్తిలో వాటా ఇవ్వకుండా, తన తల్లిని వేధిస్తున్నాడని తండ్రిపై కక్ష పెంచుకున్న రెండో భార్య కొడుకు అతడిని హతమార్చిన ఘటన పాతబస్తీ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఘటనలు గ్రేటర్‌ హైదరాబాద్‌(Hyderabad)లోని ట్రై కమిషనరేట్స్‌ పరిధిలో నిత్యం వెలుగులోకి వస్తున్నాయి.



city6.3.jpg

మచ్చుకు కొన్ని..

ఫ పాతబస్తీ పరిధిలో ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య ఘటన వెలుగులోకి వచ్చి తీవ్ర సంచలనమైంది. ప్రైవేట్‌ టీచర్‌ స్థానిక యువకునితో వివాహేతర సంబంఽధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ప్రియుడితో కలిసి పథకం ప్రకారం అతడిని చున్నీతో మెడకు ఉరిబిగించి హత్య చేసింది. ఆ తర్వాత గుండెపోటుతో మృతి చెందాడని అందరినీ నమ్మించింది. అనుమానం వచ్చిన ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


- నిద్రపోతున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హతమార్చింది. ఆపై తన భర్త నిద్రలోనే మృతి చెందాడంటూ డయల్‌-100కు ఫోన్‌ చేసి నమ్మించే ప్రయత్నం చేసి దొరికిపోయిందో భార్య. ఈ ఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఓ యువకుడితో వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని పోలీసులు గుర్తించారు.

- తాగుడుకు బానిసైన తండ్రి, ఇంటిల్లిపాదిని వేధిస్తుండటంతో అధి భరించలేని కొడుకు రోడ్డుపై వెంబడించి అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి తండ్రిని కిరాతకంగా హత్య చేశాడు. ఈ హత్యకు సంబంఽధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.


- మద్యానికి బానిసైన అన్న నిత్యం తాగొచ్చి భార్య పిల్లలను కొట్టడంతో పాటు.. తల్లిదండ్రులను, సోదరులను ఇతర కుటుంబసభ్యులను అసభ్య పదాలతో దూషిస్తుండటంతో భరించలేని తమ్ముళ్లు ఇటీవల నడిరోడ్డుపై కత్తులతో అన్నను కసిదీరా పొడిచి చంపేశారు. మేడ్చల్‌లో నడిరోడ్డుపై జరిగిన ఈ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది.

- ఇటీవల మలక్‌పేట పరిధిలో ఓ వ్యక్తిని తోటి స్నేహితులే దారుణంగా తుపాకీలో కాల్చి చంపారు. అంతా కలిసి సెటిల్‌మెంట్లు, దందాలు చేసి సంపాదించిన డబ్బులో తమకు వాటా ఇవ్వకుండా ఒక్కడే తీసుకుంటున్నాడని కక్ష పెంచుకున్న స్నేహితులు తోటి స్నేహితుడిని దారుణంగా హతమార్చారు.


నమ్మకంతో బతకాలి.. లేదంటే..

సమాజంలో సోషల్‌ రిలేషన్స్‌ చాలా దారుణంగా ఉన్నాయి. ఒకరిపై ఒకరు నమ్మకంతో బతకాలి. చంపుకోవడం మన సంస్కృతి కాదు. ముఖ్యంగా భార భర్తలు నమ్మకం లేకపోతే పెద్దలతో మాట్లాడి రాజీ పడాలి. లేదంటే విడిపోవాలి. అంతేగానీ చంపుకోవద్దు. ఆర్థిక సంబంధాలన్నీ మానవ సంబంధాలు కావు అని గుర్తుంచుకోవాలి. పాతరోజుల్లో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండేవారు. తిరిగి మనమంతా పాత సిస్టంలోకి వెళ్లాలి.

వి.సి. సజ్జనార్‌, హైదరాబాద్‌ సీపీ

city6.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ప్రియులకు అలర్ట్.. మరింత పెరిగిన బంగారం ధర..

బీసీ కులగణనపై ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేశారా..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 06 , 2026 | 09:39 AM