హత్య చేసి పరారయ్యాడు.. 40 ఏళ్ల తర్వాత దొరికాడు.. అసలేం జరిగిందంటే..
ABN , Publish Date - Aug 23 , 2026 | 09:45 AM
ఆ వ్యక్తి పేరు నత్తూలాల్. అతడు 23 ఏళ్ల వయసులో ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో ఓ హత్య చేసి పరారయ్యాడు. అప్పట్నుంచి అతడి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. దాదాపు 42 ఏళ్ల పాటు అతడి కోసం గాలించి తాజాగా పట్టుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆ వ్యక్తి పేరు నత్తూలాల్. అతడు 23 ఏళ్ల వయసులో ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో ఓ హత్య చేసి పరారయ్యాడు. అప్పట్నుంచి అతడి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. దాదాపు 42 ఏళ్ల పాటు అతడి కోసం గాలించి తాజాగా పట్టుకున్నారు. ఇప్పుడు అతడి వయసు 65 సంవత్సరాలు. నేరం చేసినప్పుడు 23 ఏళ్ల వయసులో ఉన్న నిందితుడు.. ఇప్పుడు 65 ఏళ్ల వృద్ధుడిగా పోలీసులకు పట్టుబడ్డాడు (42 years fugitive).
నత్తూ అలియాస్ నత్తూలాల్ అనే వ్యక్తి 1984లో ఓ వ్యక్తిని హత్య చేశాడు. కేసు నమోదైన తర్వాత పోలీసులకు చిక్కకుండా ఢిల్లీ నుంచి పారిపోయాడు. అప్పటి నుంచి తన గుర్తింపును, ఆచూకీని దాచుకుంటూ వివిధ ప్రాంతాల్లో జీవించాడు. నాలుగు దశాబ్దాల కాలం గడిచినా పోలీసులు ఆ కేసును వదిలిపెట్టలేదు. దీర్ఘకాలంగా పరారీలో ఉన్న నిందితులపై ఇటీవల ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ఢిల్లీ పోలీసులకు నత్తూ ఆచూకీకి సంబంధించిన కీలక సమాచారం లభించింది (Accused arrested after 40 years).
నత్తూ కదలికలపై నిఘా పెట్టి చివరకు అతడిని గుర్తించి అరెస్ట్ చేశారు (Delhi crime news). నాలుగు దశాబ్దాలకు పైగా తప్పించుకున్నప్పటికీ చట్టం నుంచి శాశ్వతంగా తప్పించుకోలేరనే విషయాన్ని ఈ అరెస్ట్ మరోసారి స్పష్టం చేసింది. పాత కేసుల్లో పరారీలో ఉన్న నిందితులను గుర్తించేందుకు ఢిల్లీ పోలీసులు చేపడుతున్న చర్యల్లో భాగంగానే ఈ అరెస్ట్ జరిగినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
ఒడిశా తీరానికి సమీపంలో కార్గో నౌక మునక.. 22 మంది గల్లంతు..
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..