Share News

అనంతపురం జిల్లా యాకిడిలో దారుణం.. బాలుడిని కిడ్నాప్ చేసి ఆ తర్వాత..

ABN , Publish Date - Mar 26 , 2026 | 01:28 PM

అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో అపహరణకు గురైన బాలుడు హేమచంద్ర దారుణ హత్యకు గురయ్యాడు. బాలుడు హేమచంద్రను అతి దారుణంగా బండరాళ్లతో మోది హత్య చేశారు. చిన్నారికి బావ వరసయ్యే సర్వేశ్ అనే వ్యక్తే ఈ దారుణానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది.

అనంతపురం జిల్లా యాకిడిలో దారుణం.. బాలుడిని కిడ్నాప్ చేసి ఆ తర్వాత..
Anantapur

అనంతపురం: యాడికి మండలం కోనుప్పలపాడులో అపహరణకు గురైన బాలుడు హేమచంద్ర దారుణ హత్యకు గురయ్యాడు. బాలుడు హేమచంద్రను అతి దారుణంగా బండరాళ్లతో మోది హత్య చేశారు. చిన్నారికి బావ వరసయ్యే సర్వేశ్ అనే వ్యక్తే ఈ దారుణానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది. బాలుడిని కిడ్నాడ్ చేసిన నిందితుడు అనంతరం కుందనకోట - చింతలాయపల్లి కొండల్లోకి తీసుకెళ్లి చంపేశాడు సర్వేశ్. నిందితుడిది యాడికి మండలం నిట్టూరు గ్రామం. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.


అసలేం జరిగిందంటే..

కోనుప్పలపాడు గ్రామానికి చెందిన బోయ గోవిందు, లక్ష్మీకాంతమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు హేమచంద్ర (7) ఉన్నారు. యాడికిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో హేమచంద్ర యూకేజీ చదువుతున్నాడు. అయితే, బుధవారం ఉదయం స్కూలు బస్సులో పాఠశాలకు వెళ్లిన వచ్చిన హేమచంద్రను సర్వేశ్ కిడ్నాప్ చేశాడు. కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. చిన్నారి కోసం బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ చివరికి కథ విషాదాంతంగా ముగిసింది.


చిన్నారిని దారుణంగా హత్య చేసి కొండల్లో పడేశాడు నర్వేశ్. అయితే, హత్య చేసింది ఒక్కడేనా.. అతనికి ఇంకెవరైనా సహకరించారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. మరోవైపు కిడ్నాప్, హత్య ఎందుకు చేశాడనే విషయాలు ఇంకా వెల్లడి కాలేదు. కుటుంబకలహాల కారణంగానే బాలుడిని హత్య చేశాడా? లేదా ఆర్థిక లావాదేవీల వ్యవహారం ఏమైనా ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి

దొంగ ప్రేమికులు.. సినిమాలను తలదన్నేలా సెల్‌ టవర్లలో చోరీలు

ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలపై ఏపీ స్పీకర్ క్లారిటీ

Updated Date - Mar 26 , 2026 | 01:47 PM