Wipro Tightens WFO Rules: ఆఫీసులో కనీసం 6 గంటలు తప్పనిసరి
ABN , Publish Date - Jan 07 , 2026 | 06:13 AM
దేశీయ ఐటీ కంపెనీ విప్రో తన ఉద్యోగులకు ఆఫీసు నుంచి పని (వర్క్ ఫ్రమ్ ఆఫీస్) నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కొద్దికాలం క్రితమే...
విప్రో ఉద్యోగులకు నిబంధనలు కఠినతరం
బెంగళూరు: దేశీయ ఐటీ కంపెనీ విప్రో తన ఉద్యోగులకు ఆఫీసు నుంచి పని (వర్క్ ఫ్రమ్ ఆఫీస్) నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కొద్దికాలం క్రితమే వారంలో మూడు రోజులు ఆఫీసు నుంచి పని చేయడం తప్పనిసరి చేసిన కంపెనీ.. ఈ నెల 1 నుంచి ఆఫీసులో కనీసం 6 గంటలు పని చేయడం తప్పనిసరి చేసింది. ఇందుకు సంబంధించి కంపెనీ మానవ వనరుల (హెచ్‌ఆర్) డిపార్ట్‌మెంట్ ఉద్యోగులకు ఇప్పటికే ఈ-మెయిల్ పంపినట్లు ఓ ఆంగ్ల మీడియా సంస్థ తన కథనంలో వెల్లడించింది. రోజులో మొత్తం 9.5 గంటలు పనిచేయాల్సి ఉంటుందని, ఆఫీసులో 6 గంటలు పనిచేసిన రోజు మిగతా 3.5 గంటలు అదే రోజు ఇంటి నుంచి పనిచేయాల్సి ఉంటుందని, అప్పగించిన పనిని పూర్తి చేయాల్సి ఉంటుందని ఈ-మెయిల్‌లో కంపెనీ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు
తొక్కిసలాట మరణాలపై విజయ్‌కు సీబీఐ సమన్లు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి