Share News

వెనెజువెలాలో భారీ భూకంపాలు.. భారత్‌కు సమస్యలు తప్పవా..

ABN , Publish Date - Jun 26 , 2026 | 10:25 AM

వెనెజువెలాలో ఇటీవల సంభవించిన రెండు భారీ భూకంపాలు అక్కడి ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. ఒక్క నిమిషం వ్యవధిలో రెండు తీవ్ర భూకంపాలు రావడంతో భారీ ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయి.

వెనెజువెలాలో భారీ భూకంపాలు.. భారత్‌కు సమస్యలు తప్పవా..
Venezuela earthquake

వెనెజువెలాలో ఇటీవల సంభవించిన రెండు భారీ భూకంపాలు అక్కడి ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. ఒక్క నిమిషం వ్యవధిలో రెండు తీవ్ర భూకంపాలు రావడంతో భారీ ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయి. ఈ భూకంపాల ప్రభావం వెనెజువెలాకు 14 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత్‌పై కూడా తీవ్రంగా పడనుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు (Venezuela earthquake).


ఇటీవలి కాలంలో వెనెజువెలా నుంచి భారత్ చమురు దిగుమతులను గణనీయంగా పెంచింది. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో భారత చమురు శుద్ధి సంస్థలు ఇటీవల వెనెజువెలా నుంచి ముడి చమురు కొనుగోళ్లను పెంచాయి. ఏప్రిల్, మే నెలల్లో భారత్‌కు ప్రధాన చమురు సరఫరాదారుల్లో ఒకటిగా వెనెజువెలా ఎదిగింది. ఈ పరిస్థితుల్లో భూకంపం వల్ల అక్కడి ఎగుమతి వ్యవస్థకు అంతరాయం కలిగితే భారత్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు (India oil imports).


భూకంపం కారణంగా వెనెజువెలా నౌకాశ్రయాల కార్యకలాపాలు దెబ్బతినడం, విద్యుత్ అంతరాయాలు, రవాణా వ్యవస్థలో సమస్యలు, అత్యవసర ఆంక్షలు అమలులోకి రావడం వల్ల చమురు ట్యాంకర్ల రాకపోకలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీంతో సరుకు రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలు, నౌకల నిరీక్షణ వ్యయాలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు (Venezuela oil exports).


భారత ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ విదేశ్‌కు వెనెజువెలా చమురు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు ఉన్నాయి. భూకంప ప్రభావం ఎక్కువకాలం కొనసాగితే ఆ పెట్టుబడుల నిర్వహణ, ఉత్పత్తి కార్యకలాపాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

మద్యం మత్తులో పెళ్లికి వచ్చిన వరుడు.. వధువు ఏం చేసిందంటే..


స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 26 , 2026 | 11:11 AM