Share News

Stock Market: మార్కెట్‌కు ట్రంప్‌ షాక్‌

ABN , Publish Date - Jan 06 , 2026 | 05:36 AM

ప్రామాణిక ఈక్విటీ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఒక దశలో 446 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్‌.. చివరికి 322.39 పాయింట్ల నష్టంతో...

Stock Market: మార్కెట్‌కు ట్రంప్‌ షాక్‌

సెన్సెక్స్‌ 322 పాయింట్లు డౌన్‌

ముంబై: ప్రామాణిక ఈక్విటీ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఒక దశలో 446 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్‌.. చివరికి 322.39 పాయింట్ల నష్టంతో 85,439.62 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 78.25 పాయింట్లు కోల్పోయి 26,250.30 వద్ద క్లోజైంది. వెనెజువెలాపైౖ యూఎస్‌ దాడితో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరగడంతో పాటు రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపకపోతే భారత్‌పై సుంకాలను మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించడం స్టాక్‌ మార్కెట్లకు ప్రతికూలంగా పరిణమించిందని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 10 పైసల నష్టంతో రూ.90.30 వద్ద ముగిసింది.

ఇవి కూడా చదవండి..

పీఓకే సహా జమ్మూకశ్మీర్‌ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్

మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 06 , 2026 | 05:36 AM