నేడు స్థిరంగా బంగారం ధరలు
ABN , Publish Date - Jan 27 , 2026 | 10:50 AM
ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. జియో పొలిటికల్ పరిస్థితులు పాజిటివ్‌గా ఉండటం ప్రస్తుత పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. కాగా గత వారం బంగారం, వెండి ధరలు సరికొత్త గరిష్ఠ స్థాయిలను నమోదు చేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్, జనవరి 27: ఇవాళ మంగళవారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ ఉదయం 11:30 గంటల ప్రాంతానికి ఉన్న ధరల్ని గమనిస్తే 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోలిస్తే, సమానంగా ఉంది.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. మంగళవారం(27-01-2026) ఉదయం 10:30 గంటల సమయానికి హైదరాబాద్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.1,61,950గా ఉంది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,48,450 దగ్గర కొనసాగుతోంది.
ఆయా ప్రధాన నగరాల్లో బంగారం(24కే, 22కే) ధరల వివరాలిలా ఉన్నాయి:
హైదరాబాద్: రూ.1,61,950; రూ.1,48,450
విజయవాడ: రూ.1,61,960; రూ.1,48,460
చెన్నై: రూ.1,63,200; రూ.1,49,600
బెంగళూరు: రూ.1,61,950; రూ. 1,48,450
ముంబై: రూ.1,61,950; రూ. 1,48,450
ఢిల్లీ: రూ.1,62,100; రూ.1,48,600
కోల్‌కతా: రూ.1,61,950; రూ.1,48,450
ఈ వార్తలు కూడా చదవండి.
హింసను ప్రశ్నించినా బెదిరింపులే!
Read Latest Telangana News and National News