స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
ABN , Publish Date - Apr 22 , 2026 | 10:53 AM
కొన్ని రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను పొడిగించిన తర్వాత దేశీయ మార్కెట్లలో వీటి ధరలు స్వల్పంగా పెరిగాయి.
ఇంటర్నెట్ డెస్క్: కొన్ని రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను పొడిగించిన తర్వాత దేశీయ మార్కెట్లలో వీటి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇవాళ(బుధవారం) ఉదయం 10:30 గంటలకు గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం.. భారతదేశంలో 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.15,145 ఉండగా.. 22 క్యారెట్ల గ్రాము ధర రూ.14,185గా ఉంది. ఇక, 18 క్యారెట్ల గ్రాము పసిడి ధర రూ.11,606కు చేరుకుంది. గ్రాము వెండి రూ.265గా, కిలో వెండి రూ.2,65,00గా ఉంది.
బంగారం ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,900గా, 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.1,42,000గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,750కి, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,41,850కి చేరుకుంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,460 ఉండగా.. 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.1,42,500గా ఉంది. ఇక, హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,750 ఉండగా.. 22 క్యారెట్ల తులం పసిడి రేటు రూ.1,41,850గా ఉంది. విజయవాడ, విశాఖ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,750కి చేరుకోగా.. 22 క్యారెట్ల తులం పసిడి రేటు రూ.1,41,850కి చేరుకుంది.
వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,65,000గా ఉంది. చెన్నైలో కేజీ వెండి రూ.2,75,000, ముంబైలో రూ.2,65,000గా ఉంది. ఇక, హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి రూ.2,75,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
యాపిల్ కొత్త సారథి జాన్ టర్నెస్
హెచ్‌సీఎల్ టెక్ లాభం రూ.4,488 కోట్లు