Share News

TASL Army Order: పీఏఎస్‌ఎల్‌కు సైన్యం నుంచి ఆర్డర్‌

ABN , Publish Date - Jan 07 , 2026 | 06:11 AM

ప్రస్తుతం సర్వీసులో ఉన్న తొలి తరం పినాక మల్టిపుల్‌ లాంచ్‌ రాకెట్‌ సిస్టమ్స్‌ (ఎంఎల్‌ఆర్‌ఎస్‌), బ్యాటరీ కమాండ్‌ పోస్ట్‌ల (బీసీపీ) ఓవర్‌హాల్‌, అప్‌గ్రేడేషన్‌లో...

TASL Army Order: పీఏఎస్‌ఎల్‌కు సైన్యం నుంచి ఆర్డర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుతం సర్వీసులో ఉన్న తొలి తరం పినాక మల్టిపుల్‌ లాంచ్‌ రాకెట్‌ సిస్టమ్స్‌ (ఎంఎల్‌ఆర్‌ఎస్‌), బ్యాటరీ కమాండ్‌ పోస్ట్‌ల (బీసీపీ) ఓవర్‌హాల్‌, అప్‌గ్రేడేషన్‌లో సహకరించేందుకు భారత సైన్యం నుంచి టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌కు (టీఏఎ్‌సఎల్‌) ఆర్డర్‌ లభించింది. ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యంలోని ఈ డీల్‌కు అనుగుణంగా టీఏఎ్‌సఎల్‌ భారత సైన్యానికి చెందిన 510 అడ్వాన్స్‌డ్‌ బేస్‌ వర్క్‌షాప్‌కు (ఏబీడబ్ల్యూ) అవసరమైన విడిభాగాలు సరఫరా చేయడంతో పాటు సాంకేతిక సహకారం సైతం అందించాల్సి ఉంటుంది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సరఫరా ఆర్డర్‌ను తమకు అందచేసినట్టు టీఏఎస్‌ఎల్‌ తెలిపింది. పినాక సిస్టమ్స్‌కు అవసరమైన విడిభాగాలు ఓఈఎంల ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూడాల్సి వస్తుందని పేర్కొంది. ఈ కార్యక్రమం తొలి దశలో ఉభయ సంస్థలు ఓవర్‌హాల్‌ కార్యక్రమాలు ఉమ్మడిగా చేపడతాయి. తదుపరి దశలో మిగతా పినాక ఎల్‌ఎంఆర్‌ఎస్‌, బీసీపీలన్నింటినీ 510 ఏబీడబ్ల్యూ దళాలే స్వయంగా సర్వీసింగ్‌ చేసుకుంటాయి. టీఏఎ్‌సఎల్‌ కీలక విడిభాగాలు సరఫరా చేయడంతో పాటు క్వాలిటీ అష్యూరెన్స్‌, సాంకేతిక మద్దతు అందించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు

తొక్కిసలాట మరణాలపై విజయ్‌కు సీబీఐ సమన్లు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 07 , 2026 | 06:11 AM