మార్కెట్లకు సవాలే..
ABN , Publish Date - Sep 21 , 2026 | 05:18 AM
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్లను దాటడం, డాలర్ మారకంలో రూపాయి విలువ 95.73 స్థాయికి పడిపోవటం ఈ వారం మార్కెట్లకు సవాల్‌గా మారనున్నాయి....
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్లను దాటడం, డాలర్ మారకంలో రూపాయి విలువ 95.73 స్థాయికి పడిపోవటం ఈ వారం మార్కెట్లకు సవాల్‌గా మారనున్నాయి. గ్లోబల్ టెక్ వ్యయాల పునఃసమీక్షతో దేశీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు పతనమవటం మార్కెట్‌ను కలవరపెడుతోంది. ముడి చమురు సెగతో టాటా మోటార్స్ వంటి ఆటో షేర్లు, బీపీసీఎల్ వంటి ఆయిల్ మార్కెటింగ్ కౌంటర్లు తీవ్ర మార్జిన్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అయితే కన్‌స్ట్రక్టివ్ డిమాండ్‌తో అంబుజా, శ్రీసిమెంట్, రియల్టీ, లాజిస్టిక్ రంగ షేర్లు దూకుడును ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) రోజుకు సగటున రూ.3,200 కోట్ల విలువైన షేర్లు విక్రయిస్తున్న సమయంలో దేశీయ మ్యూచువల్ ఫండ్ సంస్థలు.. మిడ్, స్మాల్ క్యాప్ విభాగాల్లో ఎంపిక చేసిన షేర్లలో పెట్టుబడులు పెడుతూ ట్రేడింగ్ అవకాశాలను సృష్టిస్తున్నాయి.
స్టాక్ రికమండేషన్స్
అపోలో మైక్రోసిస్టమ్స్: ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై ఆరంభం వరకు ఈ షేరు దాదాపు 150 శాతం మేర పెరిగింది. బేస్ బ్రేకౌట్ తర్వాత కన్సాలిడేషన్ కొనసాగుతోంది. స్వల్పకాల మూవింగ్ యావరేజెస్ వద్ద మద్దతు తీసుకోవటంతో ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగింది. గత శుక్రవారం రూ.370 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.360/ 350 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.455 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.455 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఎంసీఎక్స్: లాంగ్‌టర్మ్ బుల్ ట్రెండ్‌లో దూసుకుపోతున్న ఈ షేరు జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో 24 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. ప్రస్తుతం మంచి బేస్ ఏర్పడింది. మెరుగైన ఫలితాలు, రిలేటివ్ స్ట్రెంత్ నేపథ్యంలో ఎప్పుడైనా బ్రేకౌట్ జరిగే అవకాశం ఉంది. గత శుక్రవారం రూ.3,260 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.3,200 శ్రేణి లో ఎంటరై రూ.3,550 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.3,150 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: గత ఏడాది మే నుంచి 90 శాతం రాబడిని అందించిన ఈ షేరు బేస్ బ్రేకౌట్ తర్వాత స్వల్ప దిద్దుబాటుకు లోనయ్యాయి. అప్‌ట్రెండ్‌ను మాత్రం కొనసాగిస్తున్నాయి. క్రమంగా పెరుగుతున్న ఈపీఎస్, సేల్స్, రిలేటివ్ స్ట్రెంత్ వీటికి బలంగా మారాయి. గత శుక్రవారం రూ.83.54 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.81/80 శ్రేణిలో ప్రవేశించి రూ.92 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.78 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
థైరోకేర్: దీర్ఘకాలిక బుల్‌రన్‌ను కొనసాగిస్తున్న ఈ కౌంటర్ జీవిత కాల గరిష్ఠం తర్వాత 20 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. 200 రోజుల మూవింగ్ యావరేజీ వద్ద మళ్లీ మద్దతు తీసుకుని పెరిగే అవకాశం కనిపిస్తోంది. రిలేటివ్ స్ట్రెంత్ కూడా బాగుంది. గత శుక్రవారం రూ.555 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.550 శ్రేణిలో ఎంటరై రూ.630 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.520 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
పారస్ డిఫెన్స్: ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 144 శాతం రాబడిని అందించిన ఈ షేరు జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతోంది. అయితే కాస్త పుల్‌బ్యాక్‌కు లోనైంది. స్వల్పకాల మూవింగ్ యావరేజీ వద్ద మద్దతు తీసుకుంది. రిలేటివ్ స్ట్రెంత్ కూడా బాగుంది. వాల్యూమ్ గణనీయంగా పెరిగింది. డార్వాస్ బాక్స్ ఫామ్ అయ్యింది. గత శుక్రవారం రూ.1,372 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,350 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.1,600 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,320 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి
నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.12.12 లక్షల కోట్లు