నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.12.12 లక్షల కోట్లు
ABN , Publish Date - Sep 19 , 2026 | 02:40 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ నుంచి ఈ నెల 17వ తేదీ నాటికి నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.12.12 లక్షల కోట్లకు చేరినట్టు సీబీడీటీ తెలిపింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ నుంచి ఈ నెల 17వ తేదీ నాటికి నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.12.12 లక్షల కోట్లకు చేరినట్టు సీబీడీటీ తెలిపింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ. అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు 16.18 శాతం పెరిగి రూ.5.22 లక్షల కోట్లకు చేరడం ఇందుకు బాగా కలిసి వచ్చింది