మూడో రోజూ నష్టాల్లోనే
ABN , Publish Date - Oct 01 , 2026 | 02:15 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాలతోనే ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్థిరమైన ముడి చమురు ధరలు...
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాలతోనే ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్థిరమైన ముడి చమురు ధరలు, పెరిగిన ప్రపంచ బాండ్ల ప్రతిఫలాలతో పాటు.. చివరి గంటలో లోహ, ఫార్మా షేర్లలో అమ్మకాల ఒత్తిడి మూలంగా బుధవారం సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్ 48.78 పాయింట్ల నష్టంతో 72,480.29 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 533.16 పాయింట్లు పెరిగి 73,062.23 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. కానీ చివర్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా ఇంట్రాడే లాభాలను కోల్పోయి నష్టాలతో క్లోజైంది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 95.75 పాయింట్ల నష్టంతో 22,620.45 వద్ద ముగిసింది.
ఈ వార్తలనూ చదవండి:
బంగారం యూటర్న్.. మరోసారి పెరిగిన ధరలు
‘జీ’ సుభాష్ చంద్ర రుణదాతలకు ఎన్‌సీఎల్‌ఏటీ నోటీసులు