Share News

పెరిగినప్పుడు అమ్ముకునే వ్యూహం బెటర్‌!

ABN , Publish Date - Sep 14 , 2026 | 03:16 AM

ఈ వారం దేశీయ స్టాక్‌ మార్కెట్లకు ముడి చమురు సెగ, అంతర్జాతీయ పరిణామాలు పెను సవాల్‌గా మారనున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 100 డాలర్ల మార్కును దాటడం, రూపాయి 95.55 స్థాయిలకు...

పెరిగినప్పుడు అమ్ముకునే వ్యూహం బెటర్‌!

ఈ వారం దేశీయ స్టాక్‌ మార్కెట్లకు ముడి చమురు సెగ, అంతర్జాతీయ పరిణామాలు పెను సవాల్‌గా మారనున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 100 డాలర్ల మార్కును దాటడం, రూపాయి 95.55 స్థాయిలకు పడిపోవటం, ద్రవ్యోల్బణ భయాలు.. మార్కెట్‌పై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. టెక్నికల్‌గా నిఫ్టీకి 23,250-23,230 శ్రేణి అత్యంత కీలక మద్దతు స్థాయిగా ఉంది. ఒకవేళ నిఫ్టీ ఈ స్థాయిని కోల్పోతే 23,000 పాయింట్ల దిశగా జారే ప్రమాదం ఉంది. ఒకవేళ సానుకూలంగా సాగితే 23,620 వద్ద బలమైన నిరోధం ఎదురుకానుంది.

యూఎస్‌ బాండ్‌ ఈల్డ్స్‌ ప్రభావంతో మెటల్‌, రియల్టీ, ఆటో రంగాలు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనవచ్చు. డాలర్‌ బలపడుతుండటంతో ఐటీ, ఫార్మా రంగాలు మాత్రమే రక్షణాత్మక ఎంపికలుగా నిలువనున్నాయి. ఎఫ్‌ఐఐల నికర విక్రయాల నేపథ్యంలో రానున్న రోజుల్లో ‘సెల్‌ ఆన్‌ రైజ్‌’ (పెరిగినప్పుడు అమ్ముకోవటం) వ్యూహమే మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనుంది.

స్టాక్‌ రికమండేషన్స్‌

స్టాండర్డ్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ: ఐపీఓ ఆరంభం నుంచి ఈ షేరు అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు దాదాపు 340 శాతం రాబడిని ఇచ్చింది. మెరుగైన త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఈ షేరు వాల్యూమ్‌ గణనీయంగా పెరుగుతోంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ బాగుంది. గత శుక్రవారం రూ.468 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.450 శ్రేణిలో ప్రవేశించి రూ.600 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.425 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

దక్కన్‌ గోల్డ్‌మైన్స్‌: మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ షేరు ఏకంగా 100 శాతం రాబడిని అందించింది. అప్‌ట్రెండ్‌ కొనసాగుతోంది. గరిష్ఠ స్థాయిలో కన్సాలిడేషన్‌ జరుగుతోంది. అయితే ట్రెండ్‌లైన్‌ సపోర్ట్‌ స్థాయి నుంచి మళ్లీ ఎగిసే అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.229 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.220 పై స్థాయిలో ప్రవేశించి రూ.310 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.200 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


గ్రాన్యూల్స్‌ ఇండియా: ఏడాదిన్నర కాలంగా ఈ కౌంటర్‌ దుమ్మురేపుతోంది. బుల్‌రన్‌ కొనసాగిస్తోంది. గరిష్ఠ స్థాయిల్లో మరోసారి పుల్‌బ్యాక్‌ జరిగింది. ఇప్పుడు బ్రేకౌట్‌ దిశగా సాగుతోంది. ఈపీఎస్‌, సేల్స్‌ గణాంకాలు బాగున్నాయి. గత శుక్రవారం రూ.909 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.880 ఎగునవ పొజిషన్‌ తీసుకుని రూ.970 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయుతే రూ.850 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

క్యూపిడ్‌: ఏడాదిన్నరగా ఈ షేరు అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. 2,300 శాతానికి పైగా పెరిగింది. జీవితకాల గరిష్ఠం తర్వాత మరోసారి స్వల్ప పుల్‌బ్యాక్‌కు లోనైంది. గత శుక్రవారం రూ.280 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.260 శ్రేణిలో ఎంటరై రూ.350 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.250 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

టైమెక్స్‌ గ్రూప్‌: ఎన్‌ఎ్‌సఈలో లిస్టయినప్పటి నుంచి ఈ షేరు అప్‌ట్రెండ్‌లోనే సాగుతోంది. ఇప్పటి వరకు 94 శాతం రిటర్నులు ఇచ్చింది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ మెరుగ్గా ఉంది. త్రైమాసిక ఫలితాలు బాగున్నాయి. గత శుక్రవారం రూ.631 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.620 ఎగువన పొజిషన్‌ తీసుకుని రూ.750 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.600 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఈ వార్తలనూ చదవండి:

బ్రిక్స్ సదస్సు విజయవంతం.. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడి అభినందనలు

ఈఎంపీ షీల్డులు, హైటెక్ ఎన్‌క్రిప్షన్.. మిసైల్ దాడులనూ తిప్పికొట్టే జిన్ పింగ్ ఫ్లైట్.!

Updated Date - Sep 14 , 2026 | 03:16 AM