Share News

పడినప్పుడు కొనుగోలు చేయటం బెటర్‌..

ABN , Publish Date - Sep 28 , 2026 | 04:43 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా ఏడో వారం నష్టాల్లో ముగిసాయి. నిఫ్టీ గత వారం 23,140 వద్ద క్లోజైంది. ముడి చమురు భగ్గుమనటం, అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుదలతో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా...

పడినప్పుడు కొనుగోలు చేయటం బెటర్‌..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా ఏడో వారం నష్టాల్లో ముగిసాయి. నిఫ్టీ గత వారం 23,140 వద్ద క్లోజైంది. ముడి చమురు భగ్గుమనటం, అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుదలతో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా విక్రయాలకు పాల్పడినప్పటికీ, దేశీయ సంస్థాగత మదుపరుల మద్దతుతో నిఫ్టీ కీలకమైన 23,000 మార్కును నిలబెట్టుకోగలిగింది. ఈ వారం మార్కెట్ల గమనం.. ప్రధానంగా ముడి చమురు ధరలు, సెప్టెంబరు నెల ఆటో గణాంకాలపై ఆధారపడి ఉండనుంది. టెక్నికల్‌గా నిఫ్టీకి 23,000 స్థాయి అత్యంత కీలకమైన రక్షణ వలయంగా నిలుస్తోంది. 23,250-23,400 బలమైన నిరోధ స్థాయిలుగా ఉండనున్నాయి. ప్రస్తుతమున్న అనిశ్చితి నేపథ్యంలో అగ్రెసివ్‌ ట్రేడింగ్‌కు దూరంగా ఉంటూ.. పండగ డిమాండ్‌కు అండగా ఉండనున్న ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఫార్మా వంటి రక్షణాత్మక రంగాల్లో నాణ్యమైన షేర్లను పడినప్పుడు కొనుగోలు చేయటం (బై ఆన్‌ డిప్స్‌) సరైన వ్యూహం.

స్టాక్‌ రికమండేషన్స్‌

గ్రాన్యూల్స్‌: ఏడాదిన్నర కాలంగా ఈ షేరు దుమ్ము రేపుతోంది. బుల్‌రన్‌ను కొనసాగిస్తోంది. గరిష్ఠ స్థాయిల్లో మరోసారి పుల్‌బ్యాక్‌ జరిగింది. ఇప్పుడు మళ్లీ బ్రేకౌట్‌ దిశగా సాగుతోంది. ఈపీఎస్‌, సేల్స్‌ గణాంకాలు బాగున్నాయి. గత శుక్రవారం రూ.868 వద్ద ముగిసిన ఈ కౌం టర్‌లో మదుపరులు రూ.860 ఎగువన పొజిషన్‌ తీసుకుని రూ.925 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.845 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఎస్‌జీ ఫిన్‌సర్వ్‌: ఐపీఓ నుంచి ఈ షేరు దూకుడును ప్రదర్శిస్తోంది. బుల్‌ ట్రెండ్‌లో సాగుతోంది. ప్రస్తుతం గరిష్ఠ స్థాయిల్లో కన్సాలిడేషన్‌ జరుగుతోంది. మరోసారి రూ.600 స్థాయి నుంచి పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.609 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.600 ఎగువన ఎంటరై రూ.675 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.580 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

క్యూపిడ్‌: ఏడాదిన్నరగా ఈ షేరు అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. 2,300 శాతానికి పైగా పెరిగింది. జీవితకాల గరిష్ఠం తర్వాత మరోసారి పుల్‌బ్యాక్‌కు లోనైంది. గత శుక్రవారం రూ.270 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.260 ఎగువన ప్రవేశించి రూ.310 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.250 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


స్కిప్పర్‌: ఏడాదిన్నర కాలంగా ఈ షేరు కరెక్షన్‌లో ఉంది. ఇప్పటికే సుదీర్ఘమైన బేస్‌ ఏర్పడింది. డబుల్‌ బాటమ్‌ ఏర్పడటం, మూమెంటమ్‌ లభిస్తే బ్రేకౌట్‌కు అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్లు ఆసక్తిని చూపిస్తున్నారు. ఫలితాలు, రిలేటివ్‌ స్ట్రెంత్‌ పర్వాలేదు. గత శుక్రవారం రూ.551 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.550 ఎగువన ఎంటరై రూ.625 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.525 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

బజాజ్‌ కన్స్యూమర్‌: ఈ ఏడాది మార్చి నుంచి జూలైలో జీవితకాల గరిష్ఠాన్ని తాకే వరకు 350 శాతం వరకు రాబడినిచ్చిన ఈ షేరు ప్రస్తుతం 35 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. అయితే 200 రోజుల మూవింగ్‌ యావరేజీ వద్ద మద్దతు తీసుకుని పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. ఈపీఎస్‌, సేల్స్‌ మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం. గత శుక్రవారం రూ.499 వద్ద ముగిసిన ఈకౌంటర్‌లో మదుపరులు రూ.490 ఎగువన ప్రవేశించి రూ.625 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.480 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఈ వార్తలూ చదవండి

ఏఐ ముప్పు.. ఆ తప్పు మాత్రం చేయొద్దు.. టెకీలకు హెచ్చరిక

నీటిలో మునగకుండా జాగ్వార్‌ను ఎలా కాపాడారంటే

Updated Date - Sep 28 , 2026 | 04:43 AM