Share News

మార్కెట్‌ ఢమాల్‌

ABN , Publish Date - Sep 25 , 2026 | 05:42 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు గురువారం కుప్పకూలాయి. సెన్సెక్స్‌ 1,247.71 పాయింట్లు (1.67 శాతం) క్షీణించి మూడు నెలలకు పైగా (జూన్‌ 8 నాటి) కనిష్ఠ స్థాయి 73,580.54 వద్దకు...

మార్కెట్‌ ఢమాల్‌

బ్రెంట్‌.. బాండ్‌.. బీమా.. బేర్‌ర్‌..

  • సెన్సెక్స్‌ 1,248 పాయింట్లు పతనం

  • నిఫ్టీకి 384 పాయింట్ల నష్టం

  • రూ.2.65 లక్షల కోట్ల సంపద ఆవిరి

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు గురువారం కుప్పకూలాయి. సెన్సెక్స్‌ 1,247.71 పాయింట్లు (1.67 శాతం) క్షీణించి మూడు నెలలకు పైగా (జూన్‌ 8 నాటి) కనిష్ఠ స్థాయి 73,580.54 వద్దకు జారుకుంది. నిఫ్టీ 383.70 పాయింట్లు (1.64 శాతం) పాయింట్లు పతనమై 23,063.10 వద్దకు పడిపోయింది. సూచీకిది 5 నెలలకు పైగా ముగింపు స్థాయి. అమ్మకాల హోరులో ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం సంపద రూ.2.65 లక్షల కోట్లకు పైగా తగ్గి రూ.480.89 లక్షల కోట్లకు (5.01 లక్షల కోట్ల డాలర్లు) పరిమితమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.96కు చేరుకోగా.. చమురు ధర ఒక దశలో 108 డాలర్లు దాటింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో ఎన్‌టీపీసీ మినహా అన్నీ నష్టపోయాయి.

ఫెడ్‌ రేట్ల పెంపు భయాలతో యూఎస్‌ బాండ్ల రేట్లు పైపైకి

ఈ సెప్టెంబరులో అమెరికాలో వ్యాపార కార్యకలాపాలు ఐదేళ్ల గరిష్ఠానికి పెరిగాయి. అలాగే, యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ ప్రామాణిక వడ్డీ రేట్లను మరింత పెంచడంతో పాటు దీర్ఘకాలం పాటు వడ్డీ రేట్లను గరిష్ఠ స్థాయిలో కొనసాగించవచ్చన్న అంచనాలతో ఆ దేశ బాండ్ల రేట్లు గణనీయంగా పెరిగాయి. 10 ఏళ్ల బాండ్‌ రేటు ఒక దశలో 2007 నాటి గరిష్ఠ స్థాయి 5.11 శాతానికి చేరగా.. 30 ఏళ్ల బాండ్‌ రేటు 2004 నాటి గరిష్ఠానికి ఎగబాకింది. ఈ పరిణామంతో భారత్‌ సహా వర్ధమాన దేశాల ఈక్విటీ మార్కెట్లోకి వచ్చే విదేశీ పెట్టుబడులన్నీ యూఎస్‌ బాండ్లలోకి తరలిపోవచ్చన్న భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలు పోటెత్తించారు.

ముడి చమురు మళ్లీ భగ్గు: అమెరికా-ఇరాన్‌ మఽధ్య యుద్ధం ముగింపుపై అనిశ్చితి తొలగకపోవడంతో ముడి చమురు ధరలు మళ్లీ ఎగబాకాయి. బ్రెంట్‌ క్రూడాయిల్‌ పీపా ధర ఒక దశలో 4 శాతానికి పైగా పెరిగి 108.23 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.

పాపం రూపాయి: చమురు ధరలు, డాలర్‌ విలువ పెరుగుదల ప్రభావంతో రూపాయి క్షీణించడం కూడా ఈక్విటీ మార్కెట్‌పై ప్రభావం చూపింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 26 పైసలు పతనమై రూ.95.99 వద్ద ముగిసింది.


కుప్పకూలిన బీమా, ఫైనాన్షియల్‌, ఫిన్‌టెక్‌ షేర్లు

బీమా పాలసీల పంపిణీ, కమీషన్లకు సంబంధించి ఐఆర్‌డీఏఐ కఠినతర నిబంధనలను ప్రతిపాదించడంతో ఇన్సూరెన్స్‌, ఇన్సూర్‌టెక్‌ కంపెనీలతో పాటు బీమా పాలసీల పంపిణీ ద్వారా ఆదాయం లభిస్తున్న బ్యాంకింగ్‌, ఎన్‌బీఎ్‌ఫసీ, ఫిన్‌టెక్‌ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. అందులో పాలసీబజార్‌ పేరుతో ఆన్‌లైన్‌లో బీమా పాలసీల విక్రయం, ఇతర సేవలందించే పీబీ ఫిన్‌టెక్‌ షేరు ఏకంగా 36 శాతం పతనమైంది.

10-Business.jpg

ఈ వార్తలనూ చదవండి

వృద్ధురాలి పాలిట మృత్యువులా వచ్చిన కోతి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

అహ్మదాబాద్ విషాదం.. విద్యార్థినిపైకి దూసుకెళ్లిన క్రేన్.. వీడియో వైరల్

Updated Date - Sep 25 , 2026 | 05:43 AM