Share News

శుక్రవారం మార్కెట్: లాభాల్లో నిఫ్టీ, స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్

ABN , Publish Date - Sep 18 , 2026 | 04:27 PM

ఇవాళ్టి వారాంతపు (శుక్రవారం) ట్రేడింగ్ సెషన్‌లో భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు మిశ్రమ సంకేతాలతో ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ గ్రీన్‌లో ముగియగా, బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్ప నష్టాలను నమోదు చేసింది.

శుక్రవారం మార్కెట్: లాభాల్లో నిఫ్టీ, స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్
Stock Market Closing: Nifty Gains, Sensex Ends in Marginal Loss

ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 18: వారాంతపు (శుక్రవారం) ట్రేడింగ్ సెషన్‌లో భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు మిశ్రమ సంకేతాలతో ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ గ్రీన్‌లో ముగియగా, బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్ప నష్టాలను నమోదు చేసింది. నిఫ్టీ 75.80 పాయింట్లు (0.33శాతం) పెరిగి 23,346.40 దగ్గర ముగిసింది. సెన్సెక్స్ 19.63 పాయింట్లు( 0.026శాతం) కోల్పోయి 74,294.96 దగ్గర స్థిరపడింది.

నిఫ్టీ 50 సూచీ ఇవాళ ఉదయం 23,334.70 వద్ద ప్రారంభమైంది. రోజులో అత్యధికంగా 23,389.15 పాయింట్ల గరిష్ఠ స్థాయిని, అత్యల్పంగా 23,286.60 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. చివరికి గడిచిన సెషన్ ముగింపు (23,270.60) కంటే 75.80 పాయింట్లు (0.33శాతం) పెరిగి 23,346.40 వద్ద ముగిసింది.

సెన్సెక్స్ ఈ ఉదయం 74,575.24 వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. రోజువారీ ట్రేడింగ్‌లో 74,728.44 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరినప్పటికీ, ముగింపు సమయానికి అమ్మకాల ఒత్తిడి కారణంగా 74,294.96 వద్ద ముగిసింది. సెన్సెక్స్ నిన్నటి ముగింపు (74,314.59) కంటే 19.63 పాయింట్లు (0.026శాతం) స్వల్పంగా క్షీణించింది.

రోజంతా హెచ్చుతగ్గులతో సాగిన ట్రేడింగ్‌లో ఇంట్రాడే గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ కనిపించినప్పటికీ, నిఫ్టీ 23,300 స్థాయికి ఎగువన ముగియడం విశేషం.


ఇవీ చదవండి:

పైథాన్‌ను ఇట్టే పట్టేసి.. చేతికి చుట్టేసిన ఐటీ ఉద్యోగి.!

గ్రిల్‌లో చిక్కాడు.. కర్రలతో చితకబాదారు.. వీడియో వైరల్

Updated Date - Sep 18 , 2026 | 04:46 PM