Share News

మదుపరులూ జాగ్రత్త!

ABN , Publish Date - Oct 05 , 2026 | 04:58 AM

పశ్చిమాసియా సంక్షోభం, పెరుగుతున్న ముడి చమురు ధరలతో పాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐ) రికార్డు స్థాయి అమ్మకాలతో భారత స్టాక్‌ మార్కెట్లు...

మదుపరులూ జాగ్రత్త!

పశ్చిమాసియా సంక్షోభం, పెరుగుతున్న ముడి చమురు ధరలతో పాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐ) రికార్డు స్థాయి అమ్మకాలతో భారత స్టాక్‌ మార్కెట్లు గత వారం భారీగా పతనమయ్యాయి. ఈ వారం కూడా సూచీలు అదే దిశలో పయనించే అవకాశం ఉంది. చమురు ధరలు, ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు ఈ వారం కీలకంగా ఉండనున్నాయి. ఇన్వెస్టర్లు.. డిఫెన్సివ్‌ అప్రోచ్‌ను పాటించటం మంచిది. దూకుడుగా కొనుగోళ్లు చేపట్టకపోవటం శ్రేయస్కరం.

స్టాక్‌ రికమండేషన్స్‌

ప్రెసిషన్‌ వైర్స్‌: సుదీర్ఘకాలంగా ఈ కౌంటర్‌ బుల్‌రన్‌ను కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఏకంగా 145 శాతం రాబడిని అందించింది. జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో స్వల్పకాల బేస్‌ తర్వాత జోరును ప్రదర్శిస్తోంది. ఫండమెంటల్స్‌, టెక్నికల్స్‌ బాగున్నాయి. గత గురువారం రూ.501 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.490 శ్రేణిలో ప్రవేశించి రూ.550 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.475 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

సీజీ పవర్‌: ఫిబ్రవరి నుంచి జూలై వరకు 80 శాతం రాబడిని అందిచిన ఈ షేరు ప్రస్తుతం కొద్దిగా దిద్దుబాటుకు లోనైంది. మరోసారి గత నిరోధ స్థాయి వద్ద మద్దతు తీసుకుంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌, వాల్యూమ్‌ పర్వాలేదు. గత గురువారం రూ.879 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.870 శ్రేణిలో ఎంటరై రూ.970 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.855 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఏజిస్‌ లాజిస్టిక్స్‌: ఈ ఏడాది మార్చి నుంచి ఈ షేరు 150 శాతం వరకు రాబడిని అందించింది. గత త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు, రిలేటివ్‌ స్ట్రెంత్‌, డెలివరీ వాల్యూమ్‌ వంటివి ఇందుకు కారణాలు. ఒక్కసారిగా టవర్‌ ఆకారంలో ఎగిసిన ఈ షేరు జూలై నుంచి గరిష్ఠ స్థాయిల్లో కన్సాలిడేట్‌ అవుతోంది. గత గురువారం రూ.1,401 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,360 శ్రేణిలో ప్రవేశించి రూ.1,500 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,330 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

జీఈ వెర్నోవా టీడీ ఇండియా: ఈ ఏడాది ప్రారంభం నుంచి జూలై ఆరంభం వరకు 120 శాతం రాబడిని అందించిన ఈ కౌంటర్‌ రూ.5,600 స్థాయిలో గరిష్ఠ స్థాయిని తాకిన తర్వాత కాస్త దిద్దుబాటుకు లోనైంది. దాదాపు 29 శాతం మేర పతనమైంది. అయితే కొన్ని వారాలుగా పరిమిత శ్రేణిలో కదలాడుతూ 200 రోజుల మూవింగ్‌ యావరేజీ వద్ద కన్సాలిడేట్‌ అవుతోంది. గత గురువారం రూ.4,253 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.4,200 స్థాయిలో ప్రవేశించి రూ.4,600 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.4,160 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


ఐఓఎల్‌ కెమికల్స్‌ అండ్‌ ఫార్మా: ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు 225 శాతం పెరిగిన ఈ షేరు మల్టీ ఇయర్‌ బేస్‌ బ్రేకౌట్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం గరిష్ఠ స్థాయిల్లో చలిస్తోంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ సూపర్‌గా ఉంది. గత గురువారం రూ.209 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.200 శ్రేణిలో ఎంటరై రూ.245 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.190 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి..

భారత స్టాక్ మార్కెట్‌కు షాక్.. సెప్టెంబర్‌లో రూ.35,860 కోట్లు వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు..

బిహార్ వరద బాధితులకు సహాయం.. తలపై ప్యాకెట్ పడి వ్యక్తి మృతి..

Updated Date - Oct 05 , 2026 | 04:58 AM