Share News

నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు

ABN , Publish Date - Sep 29 , 2026 | 04:51 PM

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా నష్టాల్లో నడిచాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ రోజంతా హెచ్చుతగ్గులకు లోనై లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరికి స్వల్ప నష్టాలతో ముగిసాయి.

నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market Closing: Sensex Falls 243 Points, Nifty Slips 64 Points

ఆంధ్రజ్యోతి, సెప్టెంబరు 29: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా నష్టాల్లో నడిచాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ రోజంతా హెచ్చుతగ్గులకు లోనై లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరికి స్వల్ప నష్టాలతో ముగిసాయి. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరగడం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారుల (FPI) అమ్మకాలు, అమెరికా-ఇరాన్ ప్రాంతీయ ఉద్రిక్తతలు మార్కెట్‌పై ఒత్తిడి తెచ్చిన ప్రధాన కారణాలుగా నిలిచాయి.


బీఎస్‌ఈ సెన్సెక్స్ 242.65 పాయింట్లు (0.33శాతం) తగ్గి, 72,529.07 దగ్గర ముగిసింది. నిఫ్టీ 64.05 పాయింట్లు (0.28శాతం) కోల్పోయి 22,716.20 వద్ద స్థిరపడింది.


ఈ వార్తలనూ చదవండి:

చమురు సలసల.. మార్కెట్‌ విలవిల

లిస్టింగ్‌ను తప్పించుకునేందుకు టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణ

Updated Date - Sep 29 , 2026 | 04:51 PM