Share News

సెన్సెక్స్‌ దూకుడు

ABN , Publish Date - Oct 16 , 2026 | 06:10 AM

బ్యాంకులు, ఐటీ, రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ షేర్లలో జరిగిన భారీ కొనుగోళ్ల మద్దతు, ముడి చమురు ధరల్లో తగ్గుదల నేపథ్యంలో గురువారం ప్రామాణిక సూచీలు దాదాపు మూడు వారాల గరిష్ఠ స్థాయిలో ముగిశాయి...

సెన్సెక్స్‌ దూకుడు

ముంబై: బ్యాంకులు, ఐటీ, రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ షేర్లలో జరిగిన భారీ కొనుగోళ్ల మద్దతు, ముడి చమురు ధరల్లో తగ్గుదల నేపథ్యంలో గురువారం ప్రామాణిక సూచీలు దాదాపు మూడు వారాల గరిష్ఠ స్థాయిలో ముగిశాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 1,533.72 పాయింట్లు (2.11ు) పెరిగి 74,315.61 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 1,548.4 పాయింట్లు పెరిగి 74,330.29కి చేరింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 374.65 పాయింట్ల లాభంతో 22,997.35 వద్ద క్లోజైంది. సెప్టెంబరు 25 నుంచి ఇదే గరిష్ఠ స్థాయి. జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీఓ నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ షేరు బీఎస్‌ఈలో 4.03ు పెరిగి రూ.1,223.30 వద్ద ముగిసింది.

సీఏఎస్‌ నిబంధనలు సవరించిన సెబీ

క్లోజింగ్‌ ఆక్షన్‌ సెషన్‌ (సీఏఎస్‌), డెరివేటివ్స్‌ సెటిల్‌మెంట్‌ నిబంధనలను సెబీ సవరించింది. డిసెంబరు 7వ తేదీ నుంచి సవరించిన ఈ నిబంధనలు, ట్రేడింగ్‌ సమయాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. దీంతో షేర్లు, ఇండెక్స్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల ధరల నిర్ణయ విధానం కూడా మారనుంది. కొత్త నిబంధనల ప్రకారం డిసెంబరు 7వ తేదీ నుంచి అన్ని ట్రేడింగ్‌ రోజుల్లో 10 నిమిషాల పాటు అంటే మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 3.40 వరకు సీఏఎ్‌సను అనుమతిస్తారు. ఇండెక్స్‌, షేర్ల డెరివేటివ్స్‌లో మాత్రం మధ్యాహ్నం 3.45 గంటల వరకు ట్రేడింగ్‌ను అనుమతిస్తారు. అయితే ఎక్స్‌పైరింగ్‌ ఇండెక్స్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులను మాత్రం ఈ సమయంలో అనుమతించరు.

ఈ వార్తలనూ చదవండి:

సిబిల్ స్కోర్ పడిపోయిందా..? ఆరు నెలల్లో పెంచుకోండిలా

ఫెయిర్‌ఫాక్స్‌ చేతికి ఐడీబీఐ బ్యాంకు

Updated Date - Oct 16 , 2026 | 06:10 AM