Share News

సెన్సెక్స్‌ దూకుడు

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:51 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు మంగళవారం భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 1,109.10 పాయింట్లు (1.54 శాతం) ఎగబాకి 73,033.78 వద్దకు చేరుకుంది. నాలుగు నెలల్లో...

సెన్సెక్స్‌ దూకుడు

1,109 పాయింట్లు అప్‌

  • 22,700 ఎగువ స్థాయికి నిఫ్టీ

  • 3 రోజుల్లో 2% పెరిగిన రూపాయి

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు మంగళవారం భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 1,109.10 పాయింట్లు (1.54 శాతం) ఎగబాకి 73,033.78 వద్దకు చేరుకుంది. నాలుగు నెలల్లో సూచీకిదే అతిపెద్ద ఒక్కరోజు లాభం. ఇక నిఫ్టీ 358.60 పాయింట్ల (1.60 శాతం) వృద్ధితో 22,721.95 వద్ద ముగిసింది. రెండు నెలలకు పైగా కాలంలో సూచీకిదే అతిపెద్ద లాభం. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.4.58 లక్షల కోట్లు పెరిగి రూ.470.03 లక్షల కోట్లకు(4.93 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. ఐటీ, బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లలో జోరుగా కొనుగోళ్లు ఇందుకు దోహదపడ్డాయి. ట్రేడింగ్‌ వ్యయాన్ని పెంచిన దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ), సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎ్‌సటీటీ) నుంచి త్వరలో ఊరట లభించవచ్చన్న ఆశలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచాయని, వారిలో కొనుగోళ్ల ఉత్సాహం ఉప్పొంగిందని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి.

డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 42 పైసలు లాభపడి రూ.95.36 వద్ద ముగిసింది. క్రితం సెషన్‌లో రూపాయి గడిచిన ఆరు నెలల్లో ఎన్నడూ లేనంతగా 93 పైసలు పుంజుకుంది. 3 రోజు ల్లో రూపీ విలువ 152 పైసలు (దాదాపు 2ు) పెరిగింది.

ఈ ఏడాది భారత వృద్ధి రేటు 7%: ఐఎంఎఫ్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026-27) భారత జీడీపీ అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సంస్థ మరింత పెంచింది. ఈ ఏడాది జూలైలో విడుదల చేసిన ఒక నివేదికలో ఈ ఆర్థిక సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థ 6.4 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని తెలిపింది. బ్యాంకాక్‌లో జరుగుతున్న వార్షిక సదస్సులో విడుదల చేసిన తాజా నివేదికలో ఈ అంచనాలను 7 శాతానికి పెంచింది. చమురు సెగ ఉన్నా, జోరు మీద ఉన్న దేశీయ డిమాండ్‌, సేవల రంగం, పెట్టుబడులు ఇందుకు ప్రధానంగా దోహదం చేయబోతున్నట్టు తెలిపింది. 2027-28 ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలనూ ఐఎంఎఫ్‌ 6.7 శాతం నుంచి 7 శాతానికి పెంచింది.

ఇవి కూడా చదవండి:

క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్

నాసా–స్పేస్‌ఎక్స్ ప్రయోగం సక్సెస్.. ISSకు 2,800 కేజీల సరుకులతో డ్రాగన్ నౌక

వాదిస్తే నిజాలు అబద్ధాలు కావు.. లద్దాఖ్‌పై చైనాకు భారత్ కౌంటర్

Updated Date - Oct 14 , 2026 | 05:52 AM