Share News

మళ్లీ లాభాల్లోకి సూచీలు

ABN , Publish Date - Sep 17 , 2026 | 04:58 AM

బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లతో స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు బుధవారం మోస్తరుగా లాభపడ్డాయి...

మళ్లీ లాభాల్లోకి సూచీలు

333 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

ముంబై: బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లతో స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు బుధవారం మోస్తరుగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 332.63 పాయింట్లు పెరిగి 74,336.45 వద్ద, నిఫ్టీ 99 పాయింట్లు పెరిగి 23,217.60 వద్ద ముగిశాయి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 502.04 పాయింట్లు పెరిగి 74,505.86ను తాకింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో ఐటీసీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, ట్రెంట్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, భారత్‌ ఎలక్ర్టానిక్స్‌ ఎక్కువ లాభాలను నమోదు చేశాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ నష్టపోయిన షేర్లలో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టీ మళ్లీ 56,000 మార్క్‌ను చేరుకుంది. ఇది ప్రామాణిక సూచీలకు మద్దతుగా నిలిచింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ బ్రెంట్‌ ముడిచమురు ధర 107-108 మధ్య కదలాడటం, ఫెడరల్‌ రిజర్వు విధాన ప్రకటనకు ముందు యూఎస్‌ పదేళ్ల కాలపరిమితి రుణ పత్రాలపై వడ్డీ రేటు ఒకదశలో 5 శాతం దాటడం మార్కెట్‌ రికవరీని పరిమితం చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read:

భారత సినీ రంగానికి అనంత్ నాగ్‌ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్

రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 17 , 2026 | 04:58 AM