సెన్సెక్స్ 990 పాయింట్లు అప్
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:36 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలను నమోదు చేశాయి. ఆటో, బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో ర్యాలీ...
25,500 ఎగువకు నిఫ్టీ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలను నమోదు చేశాయి. ఆటో, బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో ర్యాలీ, విదేశీ నిధుల రాక, కమోడిటీ ధరల తగ్గుదల ఇందుకు దోహదపడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 989.94 పాయింట్ల (1.21 శాతం) లాభంతో తొమ్మిది నెలల గరిష్ఠ స్థాయి 83,021.75 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఈ సూచీ 1,012.06 పాయింట్లు పెరిగి 83,043.87 స్థాయిని తాకింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 286.35 పాయింట్లు పెరిగి తొమ్మిది నెలల గరిష్ఠ స్థాయి 25,514.30 వద్ద క్లోజైంది. కాగా ప్రభుత్వరంగంలోని ఎన్‌ఎల్‌సీ ఇండియా అనుబంధ సంస్థ ఎన్‌ఎల్‌సీ ఇండియా రెన్యూవబుల్స్ లిమిటెడ్ ఐపీఓకు రానుంది. ఇందులో భాగంగా తాజా షేర్ల జారీతో రూ.3,300 కోట్లు సమీకరించాలనుకుంటోంది.
ఈ వార్తలు కూడా చదవండి
వరుసగా రెండో రోజూ బంగారం, వెండి ధరలు ఢమాల్..