బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు
ABN , Publish Date - Jun 10 , 2026 | 03:14 AM
దేశీయ స్టాక్ మార్కెట్లో రెండు రోజుల నష్టాలకు తెరపడింది. మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒక దశలో 74,000 ఎగువకు చేరినప్పటికీ, చివరికి 394.50 పాయింట్ల లాభంతో...
సెన్సెక్స్ 395 పాయింట్లు అప్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో రెండు రోజుల నష్టాలకు తెరపడింది. మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒక దశలో 74,000 ఎగువకు చేరినప్పటికీ, చివరికి 394.50 పాయింట్ల లాభంతో 73,918.76 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 119.10 పాయింట్ల వృద్ధితో 23,242.10 వద్ద ముగిసింది. బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.4.28 లక్షల కోట్ల పెరుగుదలతో రూ.459.56 లక్షల కోట్లకు (4.81 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ముడిచమురు ధరలు కాస్త దిగిరావడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో రికవరీ నేపథ్యంలో మదుపరులు బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరుపడం ఇందుకు దోహదపడింది. అయితే, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం సూచీల లాభాలను పరిమితం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్
ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News