నాలుగో రోజూ లాభాలొచ్చాయ్..
ABN , Publish Date - Aug 04 , 2026 | 05:02 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. ఇరాన్‌పై దాడులు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో...
సెన్సెక్స్ 544 పాయింట్ల పెరుగుదల
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. ఇరాన్‌పై దాడులు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ముడి చమురు ధరలు భారీగా తగ్గడం ఇందుకు దోహదపడింది. విదేశీ సంస్థాగత పెట్టుబడుల రాక కూడా మార్కెట్లకు కలిసి వచ్చింది. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒక దశలో 800 పాయింట్లు ఎగబాకి 78,895.10 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 544.39 పాయింట్ల (0.70 శాతం) లాభంతో 78,639.03 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 390.70 పాయింట్లు (1.6 శాతం) ఎగబాకి 24,774.30 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 2 నిమిషాల్లో 200 పాయింట్లు అప్!
నిఫ్టీ-50 చివరి 2 నిమిషాల్లో దాదాపు 200 పాయింట్లు పుంజుకుంది. 3.28 గంటలకు 24,573 పాయింట్ల వద్ద ట్రేడైన నిఫ్టీ-50.. 3.30 గంటలకు 24,774 వద్ద ముగిసింది. స్టాక్ ఎక్స్ఛేంజీలు సోమవారం నుంచి ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్లో క్లోజింగ్ యాక్షన్ సెషన్ (సీఏఎ్‌స)ను ప్రవేశపెట్టడమే ఇందుకు కారణం. ఈ కొత్త విధానంలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ (ఎ్‌ఫ అండ్ ఓ)లో భాగమైన కంపెనీల షేర్ల ముగింపు ధరను వేలం ద్వారా నిర్ణయిస్తారు. మిగతా సంస్థల షేర్ల ముగింపు ధర నిర్ణయానికి ఎప్పటిలాగే వాల్యూమ్-వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ (వీడబ్ల్యూఏపీ) విధానమే కొనసాగుతుంది. వీడబ్ల్యూఏపీ విధానంలో చివరి 30 నిమిషాల్లో జరిగిన ట్రేడింగ్ ఆధారంగా షేరు ముగింపు ధరను నిర్ణయిస్తారు. అయితే, దేశీయ ఈక్విటీ మార్కెట్‌నూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంతోపాటు షేరు ముగింపు ధరలో మరింత పారదర్శకత్వం కోసం సెబీ.. క్లోజింగ్ యాక్షన్ సెషన్‌ను ప్రవేశపెట్టింది. ఈ విధానంలో ఎఫ్ అండ్ ఓ జాబితాలోని షేర్లలో 3.15 గంటలకు సాధారణ ట్రేడింగ్ ముగుస్తుంది. ఆ సమయంలో ముగింపు ధర నిర్ణయానికి బదులు ఎక్స్ఛేంజీలు 3.15 గంటల నుంచి 3.35 గంటల వరకు (20 నిమిషాల పాటు) క్లోజింగ్ యాక్షన్ సెషన్‌ను నిర్వహిస్తాయి. ఆ సమయంలో నమోదయ్యే క్రయ, విక్రయాల ఆర్డర్ల ఆధారంగా ఎక్స్ఛేంజీలు క్లోజింగ్ ధరను నిర్ణయిస్తారు.
ఇవి కూడా చదవండి:
నీరజ్ చోప్రా సలహాతోనే మెడల్ వరించింది: కాంస్య విజేత యశ్‌వీర్ సింగ్
టీమిండియా మాజీ కోచ్ దిలీప్ భావోద్వేగభరితమైన లేఖ